Dj Tillu రిలీజ్ రోజే హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. హృదయం బద్దలయింది అంటూ ఆవేదన!
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నేహా శెట్టి జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా విడుదలైన రోజే హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. అసలు ఏం జరిగింది నేహా శెట్టి ఇంట్లో చోటు చేసుకున్న విషాదం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే

రిలీజ్ అయిన ఫస్ట్ డేనే
జొన్నలగడ్డ సిద్దు నేహా శెట్టి జంటగా నటించిన డీజే టైటిల్ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. రిలీజ్ కంటే ముందు నుంచి ఈ సినిమా ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి కలిగిస్తూ రావడంతో సినిమాకు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. విడుదలకు ముందు వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయడంతో రిలీజ్ అయిన ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది డీజే టిల్లు.

బ్లాక్ బస్టర్ హిట్
విడుదలైన మొదటి రోజే ఇండియా సహా ఓవర్సీస్లోనూ మంచి షేర్స్ రాబట్టింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో కలిసి మొదటి రోజుకుగానూ.. రూ. 3 కోట్ల షేర్.. 5.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాడు డీజే టిల్లు. ఇక ఏరియాల వారిగా కూడా సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. నైజాంలో మొదటి రోజే రూ.1.59 కోట్లు.. సీడెడ్ రూ. 47 లక్షలు.. ఉత్తరాంధ్ర.. రూ. 26 లక్షలు.. ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఈ సినిమాతో సిద్ధు సహా టీమ్ మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ అందినట్లుగానే అర్థమవుతుంది.

ఆనంద పడే లోపు
మెహబూబా, గల్లీ రౌడి సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది నేహాశెట్టి . అయితే రెండు సినిమాలు చేసింది కానీ కమర్షియల్‌గా ఒక్క విజయం కూడా అందుకోలేదు. అయితే డీజే టిల్లు సినిమా పాజిటివ్ రివ్యూస్ తో దూసుకెళుతోంది. సినిమాలో నేహ అందం, అభినయంతో ఆకట్టుకుందని ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటిదాకా హిట్ లేని ఆ కొరతను ‘డీజే టిల్లు' తీర్చేసిందని ఆనంద పడే లోపు ఆమె ఇంట విషాదం చోటు చేసుకుంది.

నా ఛీర్ లీడర్
సినిమా విడుదలయిన రోజే ఆమె బామ్మ మృతి చెందారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుని భావోద్వేగానికి గురైందీ నేహా శెట్టి. ఈ సందర్భంగా తన బామ్మతో దిగిన ఫొటోలు షేర్ చేసిన నేహా.. ‘నా మొదటి అతిపెద్ద అభిమాని, నా ఛీర్ లీడర్ నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను రెండేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే నా పర్ఫామెన్స్ చూసేందుకు మా బామ్మ ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునేదని పేర్కొంది.
Recommended Video
బామ్మ ఐ లవ్ యూ
ఫిబ్రవరి12 డీజే టిల్లు రిలీజ్ అయి హిట్ కొట్టింది కాబట్టి అది నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. అయితే దురదృష్టవశాత్తూ నా విజయాన్ని, సంతోషాన్ని పంచుకునేందుకు నా బామ్మా నా పక్కన లేరని తలుచుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది. కానీ ఆమె ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాతోపాటే ఉంటాయిని కాస్త కుదుటపడ్డానని పేర్కొన్నది. అంతేకాక ఐ లవ్ యూ బామ్మ , డీజే టిల్లు విజయాన్ని నీకే అంకితం ఇస్తున్నా అంటూ ఎమోషనల్ అయింది ఆమె.


Click it and Unblock the Notifications











