ఈ చిన్నారి ఇప్పుడు తన అందాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. అందం, అభినయం కలబోసిన ముద్దుగుమ్మ. కుర్రాళ్ల గుండెల్లో రాధికగా నిలిచిపోయిన ఈ భామ ఎవరో కాదు నేహశెట్టి. సాధారణంగా ఒకప్పుడు డైరెక్టర్ పురీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్ అంటే కాస్తో కూస్తో అందరికీ ఆసక్తి ఉండేది.
పూరీ హీరోయిన్స్ ఎంత అందంగా ఉంటారో అంతే తెలివిగా ఉంటారు. హీరోలు పోకిరీలు అయినా హీరోయిన్స్ మాత్రం జాబ్ చేస్తూ కనిపిస్తారు. ఇక అలా పూరీ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా నేహా.. తెలుగుతెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాలో పూరీ కొడుకు ఆకాష్ హీరోగా నటించాడు.

అప్పట్లో ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. కానీ, నేహా శెట్టి నటనకు మాత్రం కుర్రాళ్లు ఫిదా అయ్యారు. మొదటి సినిమాలో కొద్దిగా డీ గ్లామర్ గా నటించి మెప్పించిన నేహా.. తరువాత సినిమాల్లో అందాల ఆరబోత చేసి షాక్ ఇచ్చింది.
గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మెరిసింది. అయితే అప్పటివరకు నేహాకు ఒక్క హిట్ కూడా అందలేదు. ఆ సమయంలోనే సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజె టిల్లు రిలీజ్ అయ్యింది. 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా నేహా రేంజ్ మారిపోయింది. రాధిక పాత్రలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి.
టిల్లును మోసం చేసి.. డబ్బు కొట్టేసి.. పారిపోయిన రాధికగా ఆమె ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత నేహా .. రాధికాగా మారిపోయింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో నేహా.. తన రేంజ్ ను, రెమ్యూనరేషన్ ను పెంచి .. కుర్ర హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. కార్తికేయ సరసన బెదురులంక.
కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ .. ఆమెకు హిట్స్ అందివ్వలేకపోయిన డ్యాన్స్ కు , అందాల ఆరబోతకు బాగానే మార్కులు పడ్డాయి.

ఇక ప్రస్తుతం నేహా .. విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది. కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం మే 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన మొదటి సాంగ్ చుట్టంలా చూసి పోకలా సాంగ్ లో ఆమె అందం, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కనుక హిట్ అయితే.. నేహా ను ఆపడం ఎవరి వలన కాదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమా నేహా కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఇక సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మరో ఎత్తు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో నేహా కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా నేహా చిన్నప్పటి ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ముద్దుగా ఎంతో క్యూట్ గా అందంగా ఉంది. నేహా చిన్నతనం లోనే కాదు ఇప్పుడు మహా హాట్ గా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











