నీ పిల్ల తప్ప... ఎవరు నగ్నంగా నిలబడ్డా ఆ ఉద్దేశ్యంతో చూడొద్దు: అనసూయ

Recommended Video

'Dont Look At Anyone With Wrong Intention' Says Anasuya Bharadwaj || Filmibeat Telugu

అనసూయ ఏదైనా ప్రోగ్రాం చేసిందంటే బాగా చేసింది, ఆమె ఆహార్యం(లుక్) బావుంది, ఆమెకు చాలా టాలెంట్ ఉంది అనే ఫీడ్ బ్యాక్ రావాల్సిన సమయంలో జనం పూర్తి విరుద్ధంగా, ఆమెను తిడుతూ, ఆమె వేసుకుంటున్న బట్టల గురించి ట్రోల్ చేస్తూ, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు అని విమర్శిస్తున్నారు.

మీ డ్రెస్సింగ్ గురించి మిమ్మల్ని టార్గెట్ చేసినవారే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? అనే ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'కథనం' మూవీ ప్రమోషన్లో భాగంగా 'దిల్ సే' అనే కార్యక్రమంలో మనసు విప్పి మాట్లాడారు.

ఇందులో నా పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తారు

ఇందులో నా పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తారు

నేను ఇద్దరు పిల్లలకు తల్లికావడం, తెలుగు అమ్మాయి కావడం వల్లే.... నా బట్టల విషయంలో వారికి అభ్యంతరం, అదే వేరే అమ్మాయి అయితే వారికి పర్లేదు. ఇందులో నా పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. నీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు? పెద్దయ్యాక నీ పిల్లలు ఏమనుకుంటారు? అని ప్రశ్నిస్తూ ఉంటారు. నా పిల్లలకు నేను ఆన్సర్ చెప్పుకుంటాను మీకేంటి సమస్య.... అంటూ అనసూయ వ్యాఖ్యానించారు.

ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరు నీ ముందు నగ్నంగా నిలబడ్డా...

ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరు నీ ముందు నగ్నంగా నిలబడ్డా...

‘‘అర్జున్‌రెడ్డి స్టైల్‌లో ఇది నా పిల్ల బే... అని ఒక అమ్మాయి ఎవరైతే నీ కోసం పుట్టిందో, ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరు నీ ముందు నగ్నంగా నిలబడ్డా నువ్వు ఆ రకంగా చూడొద్దు అనే విధంగా నా పిల్లలను పెంచుతాను''.... అని అనసూయ తెలిపారు.

మాకు కూడా అలాంటి స్పేస్ ఇవ్వండి

మాకు కూడా అలాంటి స్పేస్ ఇవ్వండి

నేటి ప్రపంచం మీ డ్రెస్, ఏజ్, స్కిన్‌తో సంబంధం లేకుండా ఆరు నెలలైనా... 60 ఏళ్లయినా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఆ మార్పు అనేది మీ మైండ్లో రావాలి. మీరు లుంగీ వేసుకున్నారు కాబట్టి నాకు చెంప పగలగొట్టబుద్ది అయింది అని నేనూ అంటే కుదురుతుందా? నీకు కంఫర్టు ఉంది, అందులో మీ లుక్ బావుంటుంది అనుకున్నారు కాబట్టి వేసుకున్నారు. అదే విధమైన స్పేస్ మాకు ఇవ్వండి.... అని అనసూయ సూచించారు.

పిల్లల పెంపకం ఎంతో ముఖ్యం

పిల్లల పెంపకం ఎంతో ముఖ్యం

నా పిల్లలకు ఒక అమ్మాయిని ఎలా చూడాలో నేర్పుతా. వాళ్లు పెద్దయ్యాక ఎలా అవుతారు అనేది వారి డెస్టినీ. కానీ నా ఇంటెన్షన్ పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఇంటి నుంచే మంచి పెంపకం మొదలవ్వాలి. మనం పెళ్లి చేసుకుంటాము అనే అమ్మాయిని తప్ప ఎవరినీ ఆ ఉద్దేశ్యంతో చూడకూడద అనే విధంగా పిల్లలు తయారవ్వాలి... అని అనసూయ అభిప్రాయ పడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X