అంబానీ పెళ్లి వేడుకలో కరీనా కపూర్ హంగామా.. ఆమె మెడలో నెక్లెస్ ఖరీదు విలువ ఎంతంటే?

దేశంలోనే అత్యంత విలాసవంతమైన వివాహంగా ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిని పేర్కొంటున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జామ్ నగర్‌లో జరిగిన ఈ వివాహ మహోత్సవం మూడు రోజులుగా కన్నుల పండుగా సాగింది. ఈ కల్యాణ మహోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, సాంకేతిక, సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. మిలియనీయం పెళ్లిగా భావిస్తున్న ఈ వేడుకలో కరీనా కపూర్ తనదైన శైలిలో ఎలా ఆకట్టుకొన్నదంటే?..

కరీనాకపూర్ ఖాన్ తన భర్త సైఫ్ ఆలీ ఖాన్‌తో కలిసి ముఖేశ్ అంబానీ ఆతిథ్యాన్ని స్వీకరించింది. పెళ్లిలో భాగంగా జరిగిన డ్యాన్స్, సంగీత కార్యక్రమాల్లో కరీనా కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా తన ఫెర్ఫార్మెన్స్‌తో వేదికపై మెరుపులు మెరిపించింది.

Do You Guess How Much Cost of Kareen Kapoor Khan s Necklace Which Wears at Anant Ambani Wedding

అనంత్ అంబానీ వివాహ వేడుకలో జరిగిన సంగీత కార్యక్రమంలో గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి స్టెప్పులేసి అతిథులను ఉర్రూతలూగించారు. వేదిక మీదకు పిలువడానికి ముందు దిల్జిత్ వచ్చి.. ఇక్కడ రిహాన్నా ఉన్నారు.. బెయాన్స్ ఉన్నారు. కానీ మనకు మాత్రం కరీనాకపూర్ కావాలి అంటూ ఆమెను ఆకాశంలోకి ఎత్తేశాడు.

Do You Guess How Much Cost of Kareen Kapoor Khan s Necklace Which Wears at Anant Ambani Wedding

కరీనా అందాలను ఆస్వాదిస్తూ దిల్జీత్ దొసాంజ్ పాటను ఆలపించారు. ఆ పాటలో సెక్సీ స్టెప్పులతో స్టేజ్‌ను దద్దరిల్లేలా చేసింది. ఆమె పాటను చూస్తూ సైఫ్ ఆలీ ఖాన్ కళ్లార్పకుండా చూస్తూ చివరకు చప్పట్లు కొడుతూ ఆస్వాదించాడు. వేదిక చుట్టు ఉన్న అతిథులు అరుపులు, ఈలలు వేస్తూ ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యారు.

ఇదిలా ఉండగా, అనంత్ అంబానీ పెళ్లిలో కరీనా కపూర్ ఖాన్ ధరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మెడ చుట్టూ ధరించిన భారీ నెక్లేస్ ఆమె ధరించడం ఇది రెండోసారి అంటూ నెటిజన్లు పసిగట్టేశారు. మొదట ఆమె ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ధరించింది. అదే నెక్లేస్‌ను రిసెప్షన్‌కు పెట్టుకొన్నది అని అభిమానులు గుర్తించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Do You Guess How Much Cost of Kareen Kapoor Khan s Necklace Which Wears at Anant Ambani Wedding

ఇక కరీనా కపూర్ ధరించిన నెక్లెస్ విలువ ఎంతుంటుందనే విషయంపై చర్చ జరిగింది. వాస్తవానికి ఆ హారం చేతితో చేసిన అరుదైన నగ. దాని ఖరీదు సుమారుగా 2 కోట్ల రూపాయలు ఉంటుందంటూ.. కాదు ఇంకా ఎక్కువనే ఉంటుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఆ నెక్లెస్ ఖరీదు ఎంత అనేది కరీనా మాత్రమే చెబితే తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X