Remuneration: టాప్ రెమ్యునరేషన్ అందుకొంటున్న 5 గురు సౌత్ హీరోయిన్లు.. ఎవరేవరికి ఎన్ని కొట్లంటే?
ప్రస్తుతం సౌత్ లో సీనియర్ హీరోయిన్లది ఎక్కువగా హవా నడుస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నయనతార, త్రిష వంటి హీరోయిన్లు ఇప్పటికీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మెయింటెన్ చేస్తూ, దానికి తగ్గ పారితోషాన్ని అందుకుంటున్నారు. ఇక యంగ్ హీరోయిన్ల సంగతి చెప్పక్కర్లేదు. మరి ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న టాప్ 5 హీరోయిన్లు ఎవరు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
1. త్రిష
ప్రస్తుతం త్రిష సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. సీనియర్ హీరోలు అందరూ ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఒకటి కమల్ హాసన్ తో థగ్ లైఫ్ కాగా, మరొకటి మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర. ఇక ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 10 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం.

2. నయనతార
రీసెంట్ గా జవాన్ మూవీ తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారినప్పటికీ నయనతార మళ్ళీ సౌత్ క పరిమితం అయిపోయింది. అయితే సౌత్ లో ఈ బ్యూటీ క్రేజ్ కి మరో హీరోయిన్ సాటిరాదన్నది మాత్రం నిజం. భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న నయనతార ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్లు పారితోషంగా తీసుకుంటుంది. ప్రస్తుతం ది టెస్ట్ అనే స్పోర్ట్స్ డ్రామా, మన్నం గట్టి, డియర్ స్టూడెంట్స్ అనే సినిమాలు చేస్తోంది.

3. శ్రీనిధి శెట్టి
ఈ లిస్టులో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి మూడో స్థానంలో నిలిచింది. కేజిఎఫ్ మూవీతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీనిధి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 7 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ అమ్మడు చివరిగా కోబ్రా అనే సినిమాలో నటించింది. ఇప్పుడు తెలుగులో తెలుసు కదా అనే మూవీలో నటిస్తోంది.
4. అనుష్క
బాహుబలి తర్వాత చాలా తక్కువగా సినిమాలు చేస్తున్న అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ చేసింది. ఇప్పుడు అనుష్క ఒక్కో సినిమాకు 4 నుంచి 7 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చివరగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే రొమాంటిక్ సినిమాలో కనిపించిన అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో, మరో మలయాళ మూవీలో నటిస్తోంది.

5. పూజా హెగ్డే, రష్మిక మందన్న
రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. అయినప్పటికీ ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్లే పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక పూజ హెగ్డేకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. చాలాకాలంగా చేతిలో సినిమాలో లేకపోయినా ఈ బ్యూటీ 5 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సమంత 3-5 కోట్లు, తమన్నా 5 కోట్లు, రకుల్ ప్రీత్ సింగ్ 2-3 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకుంటున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











