ఆస్కార్‌లో చరిత్ర సృష్టించిన ఎమ్మా స్టోన్.. ఆమె ధరించిన నెక్లెస్, డ్రెస్ ధర ఎంతో తెలుసా?

ఆస్కార్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్ తన అందంతో అందర్నీ ఆకట్టుకొన్నది. కేవలం అందంతోనే కాకుండా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుల చరిత్రలో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకొన్నది. ఈ అవార్డును సాధించిన 20 మంది తారల్లో ఒకరిగా నిలిచింది. అయితే ఆస్కార్ అవార్డుల వేడుకలో ఎమ్మా స్టోన్ ధరించిన దుస్తులు, నగలు అందర్నీ ఆకర్షించాయి. వాటి విలువ వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్‌లోని డౌల్బీ థియేటర్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల ఉత్సవంపై రెడ్ కార్పెట్‌పై జిగేల్ అనిపించేలా ఎమ్మా స్టోన్ నడిచి వ్ింది. భుజాల నుంచి నేల వరకు ఉండే నూడుల్ స్ట్రాప్ స్కర్ట్‌ ధరించింది. ముత్యాలు, వజ్రాలు పొదిగిన నెక్లెస్‌ను మెడలో ధరించింది. ముఖానికి తక్కువగానే మేకప్ వేసుకొన్నప్పటికీ.. సింపుల్ హెయిర్ డ్రెస్పింగ్‌తో అదరగొట్టింది.

Do You Know 2nd time Oscar Award Winner Emma Stone s diamond choker necklace Worth

ఎమ్మా స్టోన్ ధరించిన నెక్లెస్‌లో అరుదైన డైమండ్స్ పొదిగించారు. వాటిలో ఎల్లో డైమండ్స్ చాలా ఖరీదైనవి. ప్రముఖ డిజైనర్ రూపొందించిన ఈ నెక్లెస్ ధర భారతీయ కరెన్సీలో సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుంది అని అంచనా వేశారు.

ఇదిలా ఉండగా, ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ అనే చిత్రంలో బెల్లా బాక్ట్సర్ పాత్రతో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. ఈ పాత్రలో కనబరిచిన ప్రతిభకు ఆమెకు ఆస్కార్ అవార్డు లభించింది. ఇలా ఈ అందాల భామ ఆస్కార్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి కావడం రికార్డుగా పేర్కొంటున్నారు. గతంలో మ్యూజిక్ ప్రధానంగా వచ్చిన లాలా ల్యాండ్ అనే చిత్రానికి ఆస్కార్ అందుకొన్నారు.

Do You Know 2nd time Oscar Award Winner Emma Stone s diamond choker necklace Worth

రెండోసారి ఆస్కార్ అవార్డు అందుకోవడం ద్వారా ఎమ్మా స్టోన్ ఓ అరుదైన క్లబ్‌లో చోటు సంపాదించారు. ఇప్పటి 20 మంది రెండోసారి ఆస్కార్ సాధించారు. తాజా ఈ నటి కూడా రెండోసారి ఆస్కార్ చేతపట్టి వారి సరసన చేరింది. గత 10 ఏళ్లలో ఎమ్మా స్టోన్ 5 సార్లు ఆస్కార్ నామినేషన్ సాధించడం మరో రికార్డుగా చెప్పుకోవచ్చు. గతంలో బాఫ్టా, గొల్డెన్ గ్లోబ్స్, గిల్డ్ అవార్డులు సాధించింది.

2024 సంవత్సరంలో ఎమ్మా స్టోన్ భారీ పోటీని ఎదుర్కొన్నది. కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమాలో నటించిన లిల్లీ గ్లాడ్‌స్టోన్, మేస్ట్రో సినిమాలో నటి కారీ ములిగన్, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ చిత్రంలో సండ్రా హల్లర్, న్యాడ్ చిత్రంలో అన్నెట్టే బెనింగ్, పూర్ థింగ్స్ సినిమాలో లాంతిమస్ లాంటి టాలెంటెడ్ యాక్టర్లను ఎదురించి రెండోసారి అవార్డు సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X