లేటు వయసులో రంభ గ్లామర్ ధగధగలు.. ఆమె బ్యూటీ, గ్లామర్, హెల్త్ సీక్రెట్ గురించి మీకు తెలుసా?
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రతారగా రాణించిన రంభ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా తన గ్లామర్‌తో విశేషంగా ఆకట్టుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో జతకట్టిన ఆమె తన కెరీర్‌లో అనూహ్యమైన విషయాలను అందుకొన్నారు. అయితే కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయిపోయారు. వివాహం తర్వాత గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటూ తన పిల్లలు, భర్తతో దాంపత్య జీవితాన్ని సజావుగా సాగిస్తున్నారు. అయితే 4 పదుల వయసులో కూడా రంభ చెక్కు చెదరని అందంతో ఆకట్టుకొంటున్నారు. రంభ బ్యూటీ, హెల్త్, గ్లామర్, ఫిట్‌నెస్ గురించిన వివరాల్లోకి, అలాగే ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..
రంభ కేవలం అందం, అభినయంతోనే కాకుండా డ్యాన్సులు, స్టెప్పులతో హీరోలతో పోటీపడి వెండితెర అభిమానులకు దేవతగా మారింది. ఓ దశలో హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకొంటూ రికార్డు స్థాయిలో సినిమాలు చేశారు. స్టార్ హీరోయిన్‌గా రాణించిన సమయంలో అత్యధిక పారితోషికం అందుకొన్న ఇండియన్ యాక్టర్‌గా పేరు తెచ్చుకొన్నారు. అలాంటి గ్లామర్ తార లేటు వయసులో కూడా గ్లామర్‌తో తళతళలాడుతున్నది.

రంభ అందానికి, ఆకట్టుకొనే ఆహార్యానికి కారణం ఆమె పాటించే ఆహార నిబంధనలే కారణమని సన్నిహితులు చెప్పుకొంటారు. ఆమె ప్రూట్స్, వెజిటెబుల్స్, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రొటీన్స్, హెల్తీ ఫ్యాట్ తీసుకొంటారు. ఇలాంటి పోషకాలు తీసుకోవడం వల్ల ఆమె ఆరోగ్యం, అందం చెక్కు చెదరకుండా ఉన్నదని పేర్కొంటారు. ఆమె ఆహార నిబంధనలు పాటించడమే కాకుండా శారీరక వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేస్తారు స్నేహితులు చెబుతారు.
రంభ ముఖంలో చెదరని చిరునవ్వుకు కారణం మానసిక, శారీరక ఒత్తిడికి దూరంగా ఉండటమే. మెడిటేషన్, దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, శరీరా బరువు అదుపు తప్పకుండా ఉండటం లాంటి అంశాలలో జాగ్రత్తలు పాటిస్తారు. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన నిద్ర, సకాలంలో నిద్రకు ఉపక్రమించడం, సూర్యోదయాని కంటే ముందుగా లేవడం లాంటి చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తాయి.

ః
అభిమానులు, సినీ ప్రేక్షకులు, ఎదుటి వారు కళ్లు తిప్పుకోలేని అందం వెనుక ఆమె పాటించే చర్మ సౌందర్య పోషణే కారణమంటారు. తన శరీరానికి ఏం కావాలో వాటినే ఉపయోగించడం, కృత్రిమ రసాయనాలకు దూరంగా ఉండటం చేస్తుంటుంది. అలాగే ఆర్గానికి వస్తువులను చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తుంది. అని చెప్పుకొంటారు. తక్కువ మేకప్ చేసుకోవడం ఆమె గ్లామర్ సీక్రెట్ అని సన్నిహితులు, స్నేహితులు చెప్పుకొంటారు.
రంభ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకొంటారు. కార్డియో వాస్కులర్ ఎక్సర్‌సైజులు, మానసిక, శారీరక ధృడత్వానికి ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకోవడంలో శ్రద్ద చూపిస్తుంటారు. తగినంత విశ్రాంతి తీసుకొంటూ మానసిక ఉల్లాసానికి ప్రాధాన్యత ఇస్తారు. రెగ్యులర్‌గా వర్కువుట్ చేస్తూ తన బాడీని క్రమబద్దీకరిస్తుంటారు అని డైటీషియన్స్ చెబుతుంటారు.

అచ్చ తెలుగు కుటుంబానికి, విజయవాడకు చెందిన రంభ వయసు 47 సంవత్సరాలు. ఇంద్ర కుమార్ పథమనాథన్ అనే వ్యక్తిని 2010 సంవత్సరంలో పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం రంభకు ముగ్గురు సంతానం. దాదాపు 20 సంవత్సరాలు అగ్రతారగా వెలుగు వెలిగారు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు టెలివిజన్ పై న్యాయమూర్తిగా కనిపించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన పిల్లలు, భర్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











