Prabhas కంటే ఆ హీరోయిన్ ఆస్తులే ఎక్కువ.. హిట్టు లేకుండా ప్రియాంక చోప్రాను మించిన సంపద..ఆ నటి ఎవరంటే?

ప్రపంచ సినిమా రంగంలో హీరోయిన్లకు హీరోల కంటే తక్కువ రెమ్యునరేషన్లు ఉంటాయనేది అందరికి తెలిసిందే. గత కొద్దికాలంగా హీరోల కంటే తక్కువ పారితోషికాలు ఇవ్వడమేమిటనే విషయంపై హీరోయిన్లు నిరసన, అసమ్మతి సెగను చిమ్ముతున్నారు. అయినా హీరోయిన్ల ఆవేదనను నిర్మాతలు పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు.

అయితే తాజాగా తన కెరీర్‌లో హిట్టు కూడా సాధించని ఓ హీరోయిన్ ఆస్తుల విషయంపై అన్ని వర్గాలు చర్చించుకొంటున్నారు. టాప్ హీరోలకంటే మించి ఆస్తులు ఉన్న ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకు అంత రేంజ్‌లో ఉండటానికి సంపాదన ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొంటే వెళితే..

Do you Know actress Jami Gertz assets are more than Priyanka Chopra, Prabhas, Shah Rukh Khan?

హాలీవుడ్ పరిశ్రమలో సినిమా పరిశ్రమలో ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపిక పదుకోన్, ఏంజెలీనా జోలీ, జూలియా రాబర్ట్స్ లాంటి పేర్లు విని ఉంటాం. ప్రియాంక చోప్రా భారీగా సినిమాలు చేస్తూ లెక్కకు లేనన్ని ఆస్తులు కూడబెట్టుకొన్నది. ఆలియాభట్ ఇటీవలే హాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అయితే ఇలాంటి టాప్ యాక్టర్ల పేర్లు విన్న తర్వాత.. వారి కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్న జామీ గెర్ట్స్ పేరు చెబితే.. ఆమె ఎవరు అనే ప్రశ్న ఎవరి నుంచైనా రావడం సహజమే.

Jami Gertz

అమెరికాకు చెందిన జామీ గెర్ట్స్ (Jami Gertz) నటి పేరు చెబితే ఎవరూ కూడా గుర్తుపట్టారు. ఆమె వయస్సు 57 సంవత్సరాలు. బాలనటిగా హాలీవుడ్‌లోకి 1970లో ప్రవేశించారు. 1980 దశకంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కానీ అదృష్టం కలిసి రాలేదు. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. దాంతో అడపాదడపా కొన్ని సినిమాలు, మరికొన్ని టెలివిజన్ షోలు చేసుకొంటూ కాలం వెల్లదీసింది.

కానీ జామీ గెర్ట్స్ చేసిన ట్విస్టర్, స్టిల్ స్టాండింగ్, ది నైబర్ షోలకు అమెరికా టెలివిజన్‌లో భారీ స్పందన వచ్చింది. దాంతో సినిమాలకు దూరమైంది. 1980 నుంచి 1997 వరకు కేవలం ఐదు సినిమాల్లోనే నటించింది. ఇటీవల కాలంలో ఆమె ఐ వాంట్ యూ బ్యాక్ అనే సినిమాలో అతిథి పాత్రతో సరిపెట్టుకొన్నది.

Jami Gertz

అయితే జామీ గెర్ట్స్ ఆస్తులు మాత్రం తరగని విధంగా ఉన్నాయి. తాజా ట్రేడ్ లెక్కల, అంచనాల ప్రకారం. ఆమె ఆస్తుల విలువ 30000 కోట్లు. ఆమె భర్త టోని రెజ్లర్ అత్యంత సంపన్న వ్యాపారవేత్త. అట్లాంటా హాక్స్ అనే అమెరికన్ ఫుట్‌బాల్ జట్టు భాగస్వామి. దాంతో జామీ గెర్ట్స్ ఆస్తుల విలువ భారీగా పెరిగిపోయింది.

ఇండియన్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలతో పోల్చితే జామీ గెర్ట్స్ ఆస్తులు ఎక్కువ. ప్రభాస్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అయితే ఒక్క హిట్టు కొట్టకుండానే అత్యధిక ఆస్తులు ఉన్న నటుల జాబితాలో జామీ గెర్ట్స్ చేరింది. రెండు దశాబ్దాల కాలంలో కేవలం 5 సినిమాల్లో నటించినా.. అత్యధిక ఆస్తులు ఉన్న నటిగా గుర్తింపు పొందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X