Laya Salary యాక్టింగ్ మానేసి.. లయ చేసిన ఉద్యోగం ఏమిటో తెలుసా? నెలకు జీతం ఎంతంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాల్లో హీరోయిన్ లయ సుస్థిర స్థానం సంపాదించుకొన్నది. కెరీర్ గ్రాఫ్ పీక్స్‌లో ఉండగానే.. టాలీవుడ్‌ను వదిలేసి అమెరికాకు వెళ్లిపోయారు. చాలా సంవత్సరాలుగా దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ మళ్లీ తెలుగు సినిమా పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నది. సినీ నటి లయ వ్యక్తిగత, దాంపత్య జీవితం, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోకి వెళితే..

బాలనటిగా టాలీవుడ్‌లోకి లయ
పలు విషయాల్లో ప్రతిభను చాటుకొన్న లయ విషయానికి వస్తే.. అచ్చ తెనుగు తెలుగు అమ్మాయి. విజయవాడలో జన్మించిన లయ తన బాల్యంలో క్లాసికల్ డ్యాన్సర్‌గా, స్టేట్ లెవెల్ చెస్ ప్లేయర్‌గా ప్రతిభను చాటుకొన్నది. భద్రం కొడుకో సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి బాలనటిగా ప్రవేశించింది. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా అవతారం ఎత్తింది.

హీరోయిన్‌గా 40 చిత్రాల్లో..
హీరోయిన్‌గా లయ దాదాపు 40 చిత్రాల్లో నటించి తన పాత్రలతో, పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. మనోహరం, దేవుళ్లు, ప్రేమించు, శివరామరాజు, మిస్సమ్మ, స్వరాభిషేకం లాంటి తెలుగు చిత్రాలతోపాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రంలో తన అభినయంతో మంచి పేరు, ప్రతిష్టలను సంపాదించుకొన్నారు.

2006 సంవత్సరంలో వివాహం
హీరోయిన్ లయ 2010 సంవత్సరం వరకు తన కెరీర్‌ను టాప్ గేర్‌లో కొనసాగించింది. బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం సినిమాలో నటించిన తర్వాత అమెరికాలో డాక్టర్ శ్రీ గణేష్‌ను 2006 సంవత్సరంలో వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది. లయకు శ్లోక, వచన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే మళ్లీ తెలుగు తెరకు తిరిగి వచ్చే ప్రయత్నాలు ఆమె చేస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన
సినీ నటి లయ ఇటీవల తెలుగు మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలు వెల్లడించారు. చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. హైదరాబాద్ నగరం పూర్తిగా మారిపోయింది. న్యూయార్, న్యూజెర్సీ నగరాల కంటే బాగుంది అంటూ లయ మురిసిపోయారు. అమెరికాలో పెద్ద నగరాలకు ఏ మాత్రం హైదరాబాద్ తీసిపోదని కితాబు ఇచ్చారు.

అమెరికాలో ఉద్యోగం
అయితే పెళ్లి తర్వాత అమెరికాలో లయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని చేసినట్టు వెల్లడించారు. 2011 నుంచి లయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా భారీ జీతాన్ని అందుకొన్నారని చెప్పారు. ప్రత నెలకు 12 వేల డాలర్ల జీతాన్ని అంటే దాదాపు నెలకు 10 లక్షల రూపాయల జీతాన్ని తీసుకొన్నాను అని చెప్పారు. అంతేకాకుండా డ్యాన్స్ స్కూల్ పెట్టి పిల్లలకు నృత్యాన్ని నేర్పించాను. కరోనా కారణంగా డ్యాన్స్ స్కూల్‌ను మూసివేశామని చెప్పారు.

టాలీవుడ్‌లో రీ ఎంట్రీ
అయితే టాలీవుడ్‌లోకి సెకండ్ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ఉంది. కానీ మంచి పాత్రలు, నా ఇమేజ్‌కు భంగం వాటిల్లని పాత్రలు వస్తే చేయడానికి ఇష్టం లేదు. కంటెంట్‌తో ఉండే పాత్రలు, సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నానని ఇటీవల తన మనసులోని మాటను చెప్పింది. అయితే లయ సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











