Anasuya Bharadwaj అనసూయ పుట్టుక, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలుసా? రంగమ్మత్త లైఫ్‌లో మరో కోణం!

తెలుగు సినిమా పరిశ్రమలో గ్లామర్ తార, ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటున్న నటిగా అనసూయ అందరికి తెలుసు. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల్లోని పాత్రలతో తనలో మరో కోణం ఉందని నిరూపించుకొన్నారు. అయితే ఎంతో మందికి వినోదం పంచుతున్న ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ విషయాన్ని రజాకార్స్ దర్శకుడు వెల్లడించిన తర్వాత అనసూయ అంటే ఏమిటో తెలిసిందని అందరూ అంటున్నారు. అనసూయ పుట్టుక, కుటుంబ నేపథ్యం గురించిన వివరాల్లోకి వెళితే..

అనసూయ తాజాగా తెలంగాణ చరిత్రలో జరిగిన రజాకార్ల అరాచకాలపై రూపొందిన రజాకార్స్ సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా అనసూయ గురించి దర్శకుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Anasuya Bharadwaj

భూదాన్ ఉద్యమం జరిగిన గడ్డ మీద పుట్టిన బిడ్డ అనసూయ. పోచంపల్లి గ్రామంలో అనసూయ పుట్టారు. 100 గడపల ఇల్లు నల్లగొండ జిల్లాలో ఎవరికైనా ఉందంటే.. అది అనసూయ ఫ్యామిలీ ఇల్లు. ఆ ఇంటిలో వందల మందికి భోజనం పెట్టిన ఇల్లు వాళ్లది. భూదాన్ ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలను నిలబెట్టింది అనసూయ పుట్టిన ఇల్లే అని రజాకార్స్ మూవీ దర్శకుడు యాటా స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులకు ధైర్యం ఇచ్చి అండగా నిలబడింది అనసూయ పుట్టిన ఇల్లే. అలాంటి ఇంటిలో పుట్టిన అనసూయ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ పంచే నటి మాత్రమే కాదు.. ఆమె రక్తంలో ఆవేశం, ఆవేదన ఉన్నాయి కాబట్టే నేను రజాకార్స్ సినిమాలోని పాత్రకు ఎంపిక చేశాను అని మూవీ దర్శకుడు యాటా స‌త్య‌నారాయ‌ణ చెప్పారు.

మా జిల్లా ఆడబిడ్డ అనసూయను ఆ దృష్టితోనే చూశాను. నేను ఈ కారెక్టర్‌కు అనసూయను ఎన్నుకొంటున్నట్టు చెప్పగానే అందరూ పెదవి విరిచారు. కానీ నేను అనసూయనే తీసుకొంటానని చెప్పాను. మా సినిమాలో పాట రిలీజైన తర్వాత అనసూయపై గౌరవం పెరిగిందని చాలా మంది చెప్పారు. అనసూయలో మరో కోణం ఉంది అని దర్శకుడు యాటా స‌త్య‌నారాయ‌ణ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X