Stock Market అనుష్క దంపతులకు వందల కోట్ల లాభం.. విరాట్‌ కోహ్లీకు 300 శాతం ప్రాఫిట్ తెచ్చిన షేర్ ఏంటో తెలుసా?

సినీ తారలైనా, క్రికెటర్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులంతా దీపం ఉండగానే ఇంటిని చక్క బెట్టుకొనే విధంగా తమ సంపాదనను తెలివిగా ఇతర రంగాల్లో పెడుతూ ఘనమైన లాభాలను సాధిస్తున్నారు. ఎంతో మంది సీనియర్ల సలహాలతో ఆర్థికంగా పరిపుష్టి అయ్యేందుకు ప్లాన్స్ వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, ఇండియన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి అనతికాలంలో వందల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించారు. అయితే వారి సక్సెస్ స్టోరి గురించిన వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ సంపాదన ఎంతో వారికి తెలియని పరిస్థితి. వారి తరఫున పనిచేసే ఫండ్ రైజర్స్, స్టాక్ మార్కెట్ మేనేజర్లు వారి తరఫున భారీగా పెట్టుబడి పెడుతున్నారు. అలా ఇటీవల కాలంలో అనుష్క, విరాట్ పెట్టుబడి పెట్టిన స్టాక్ Go Digit (గో డిజిట్ ). ఈ స్టాక్ త్వరలోనే ఐపీవోగా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నది.

Do You Know Anushka Sharma Virat Kohli earn 300 percent profit from Go Digit stock

ఇటీవల Go Digit (గో డిజిట్ ) ఐపీవోకు వచ్చింది. అయితే అనుష్క దంపతులు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా సుమారుగా 267000 షేర్లను.. ఒక్కో షేర్ విలువ 75 రూపాయల చొప్పన కొనుగోలు చేశారనేది మార్కెట్ నిపుణుల వెల్లడించారు. ఈ షేర్ స్టాక్ మార్కెట్‌లో వచ్చేవారం లిస్ట్ కానున్నది.

అయితే స్టాక్ మార్కెట్ నిపుణులు వెల్లడించిన తాజా వార్తల ప్రకారం.. Go Digit (గో డిజిట్ ) భారీ ధరకు లిస్ట్ కానున్నది. ఈ షేర్ అప్పర్ బ్యాండ్ రేట్ 278 రూపాయలుగా పేర్కొంటున్నారు. అయితే ఈ షేరును ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా 75 రూపాయల చొప్పున 2.7 లక్షల షేర్లలను సుమారు 2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. దాంతో వారి షేర్ విలువ 270 శాతానికిపైగా పెరిగింది.

Do You Know Anushka Sharma Virat Kohli earn 300 percent profit from Go Digit stock

విరాట్ కోహ్లీ పెట్టుడి 2 కోట్లు కాగా.. వచ్చేవారం లిస్ట్ అయ్యే నాటికి ఆ ఇన్వెస్ట్‌మెంట్ విలువ దాగాపు 9.25 కోట్లు. అంటే కేవలం నాలుగు నెలల్లోనే వారికి 7.25 కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే కంపెనీ షేర్‌ను అనుష్క శర్మ అదే ధరకు సుమారుగా 70 వేల షేర్లను 2 కోట్లరూపాయల వెచ్చించి కొనుగోలు చేసింది. ఆమెకు కూడా భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది.

ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఆడుతున్నారు. ఇక అనుష్క శర్మ నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జులాన్ గోస్వామి బయోపిక్ చక్‌దా ఎక్స్‌ప్రెస్‌ చిత్రంలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X