1000 కోట్లతో బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత..ఇండస్ట్రీకి దూరమైన తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
హీరోయిన్లకు కెరీర్ గ్రాఫ్ తక్కువే. ఆ గ్రాఫ్‌ను ముందుకు కొనసాగించాలంటే చాలా కష్టం. అందుకోసం రకరకాల సినిమాలు, పాత్రలు చేస్తుంటారు. సినీ రంగంలో హిట్టు పడితే దానిని కెరీర్‌కు ఉపయోగించుకొనేలా హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తారు. తెలుగు హీరోయిన్లలో వరుస హిట్లు, బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకొన్న హీరోయిన్ భారీ ఆఫర్లను వదులుకొని సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ అడపదడపా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తన ఉనికి రుజువు చేస్తున్నారు. 1000 కోట్లు వసూలు చేసిన సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆ హీరోయిన్ వివరాల్లోకి వెళితే..
సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అనుష్క శెట్టి. ఆ తర్వాత వరుస సినిమాలు, అగ్ర హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలతో ఆకట్టుకొన్నారు. గ్లామర్, ఫెర్ఫార్మెన్స్ తరహా పాత్రలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. అరుంధతి సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్నారు. ఆ తర్వాత కెరీర్‌పరంగా వెనక్కి చూసుకోలేదు.

అయితే బాహుబలి సినిమా చారిత్రాత్మక విజయం సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఆ సినిమాలోని ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఆ సినిమా తర్వాత అనుష్క సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది.
ఇక బాహుబలి సినిమా తర్వాత కన్నడ, తమిళం, హిందీ రంగాల నుంచి భారీ ఆఫర్లు లభించాయి. కానీ ఆరోగ్యపరంగా అనుష్క కొన్ని సమస్యలు ఫేస్ చేయడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె ఆరోగ్య సమస్యలను చక్క బెట్టుకొంటూ సెలెక్టివ్‌గా పాత్రలు చేస్తున్నారు. అయితే ఆమె కోసం క్రేజీ పాత్రలు రాస్తూ దర్శకులు ఆమెను నటింప జేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఘనం విజయం సాధించింది. ఆ సినిమాతో ఎప్పుడెప్పుడూ చూద్దామా? ఎదురు చూసిన ప్రేక్షకులకు ఆ కోరికను తీర్చింది. ప్రస్తుతం కొన్ని కథలు వింటూ.. తన ఇమేజ్‌కు తగిన పాత్రల కోసం వేచి చూస్తున్నారు. స్వీటీ మళ్లీ ఎప్పుడు పలకరిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











