ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్..స్టార్ హీరోల ఆఫర్లు రిజెక్ట్..సినిమా ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే?
తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొనే అవకాశం చాలా కొద్ది మంది హీరోయిన్లకే దక్కుతుంది. అలాంటి అదృష్టం అందరికి దక్కదు. తొలి చిత్రం కాకపోయినప్పటికీ డ్రీమ్ గర్ల్ ద్వారా హేమా మాలిని, సత్యం శివం సుందరంతో జీనత్ ఆమన్, బాబీతో డింపుల్ కపాడియా దేశవ్యాప్తంగా కుర్రకారును ఊర్రూతలూగించారు. ఇలా ఒకే సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్న హీరోయిన్ తన మూడో సినిమాకే గుడ్‌బై చెప్పింది. ఆ హీరోయిన్ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను ఓవర్‌నైట్ స్టార్ చేసిన చిత్రం మైనే ప్యార్ కియా. ఈ సినిమాలో సుమన్ అనే పాత్రలో భాగ్యశ్రీ నటించింది. ఆ సినిమాతో ఆమె కూడా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. దేశవ్యాప్తంగా యువతు, ముసలి, ముతక అనే తేడా లేకుండా ఆమె అందానికి ఫిదా అయ్యారు.

మైనే ప్యార్ కియాలో పాటలు, కథ, డైలాగ్స్ అన్నీ చక్కగా ఉండటంతో బాలీవుడ్‌లోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోకి డబ్ అయి సంచలన విజయం సాధించింది. 1 కోటి రూపాయలు పెడితే 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో భాగ్యశ్రీ చుట్టూ ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ ఆ సినిమా తర్వాత తన వద్దకు వచ్చిన భారీ ఆఫర్లను స్వీకరించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మైనే ప్యార్ కియా తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు.
భాగ్యశ్రీ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె మరాఠీ రాజవంశానికి చెందిన అమ్మాయి. మహారాష్ట్రలోని సంగ్లీ వంశానికి చెందిన చింతమన్ రావు దుండీరావు పట్వర్ధన్ మనవరాలు. అయితే తన తొలి చిత్రంలో నటించే సమయానికే హిమాలయ్ దసానీని ప్రేమించింది. దాంతో ఆమె అతడిని 1990లో వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది.

పెళ్లి తర్వాత 1992 సంవత్సరంలో త్యాగి, పాయల్ అనే సినిమాల్లో నటించింది. కానీ సినిమాలు హిట్ కాకపోవడంతో తెలుగులో ఓంకారం అనే సినిమాలో నటించింది. అ తర్వాత ఆమె పలు చిత్రాల్లో నటించినప్పటీకి ఆమెకు గుర్తింపు, పేరు, పాపులారిటీ తీసుకు రాలేకపోయాయి. తాజాగా తలైవి, ప్రభాస్‌తో రాధేశ్యామ్ సినిమాల్లో నటించింది.
ఇటీవల సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసి కా భాయ్, కిసి కి జాన్, హిందీ చత్రపతి సినిమాల్లో నటించింది. అయితే భాగ్వశ్రీ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నది. లేటు వయసులో కూడా తన అందంతో ఆకట్టుకొనే ప్రయత్నాలు సఫలమవుతాయో లేదో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











