For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Sonam Kapoor: 14వ ఏట నుంచే అరుదైన వ్యాధి బారినపడి.. ఎంట్రీ కోసం 35 కిలోలు తగ్గిన సంగతి తెలుసా?

  |

  బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కు సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్ అనే ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే. వీరిలో సోనమ్ హీరోయిన్‌గా మారి మంచి పేరు తెచ్చుకోగా రియా నిర్మాతగా మంచి పేరును తెచ్చుకుంది. హర్షవర్ధన్ కపూర్ హీరోగా ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటున్నాడు. అయితే ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సోనమ్ కపూర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  చీర కట్టులో ఎద అందాలతో కవ్విస్తోన్న అందాల 'నిధి'

  'సావరియా'తో ఎంట్రీ

  'సావరియా'తో ఎంట్రీ

  ఈరోజు సోనమ్ కపూర్ అహుజా పుట్టినరోజు. నేటితో ఆమె 36 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. రణబీర్ కపూర్ సరసన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'సావరియా' సినిమాతో ఆమె 2007లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తన 14 సంవత్సరాల కెరీర్లో సోనమ్ 'రాంజన', 'భాగ్ మిల్కా భాగ్', 'ఖూబ్సురత్', 'ప్రేమ్ రతన్ ధన్ పయో', 'నీర్జా', 'ప్యాడ్ మ్యాన్', 'కొన్ని విజయవంతమైన సినిమాల్లో నటించింది.

   హీరోయిన్ కావడం కోసం

  హీరోయిన్ కావడం కోసం

  ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యుత్తమ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న సోనమ్ కపూర్ 2000 స్ లో ఆమె బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నప్పుడు, ఆమె బరువు ఏకంగా 86 కిలోలు. సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని ఆశ ఉన్న ఆమె రెండేళ్ల పాటు వర్కౌట్స్, డైట్స్‌ చేసి సోనమ్ 25 కిలోల బరువు కోల్పోయి నాజూగ్గా తయారు అయింది.

   తల్లి వల్లే ఇలా

  తల్లి వల్లే ఇలా

  ఒక మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా సోనమ్ కపూర్ తన తల్లి సునీతా కపూర్ తన బరువు తగ్గడానికి సహాయపడిందని వెల్లడించారు. నిజాయితీగా చెప్పాలంటే "అన్ని విధాలా నా అధిక బరువును వదిలించుకోవడానికి నా తల్లి నాకు సహాయపడింది. ఆమె చేసిన మొదటి పని ఏమిటంటే, యుక్తవయసులో నాకు బాగా నచ్చిన వస్తువులను దూరంగా ఉంచడమే అని పేర్కొంది. తనకు ఇష్టం అయిన చాక్లెట్లు, ఐస్ క్రీములు, వేయించిన ఆహారాలు మరియు స్వీట్లు ఆమె నాకు దూరం చేసిందని పేర్కొంది.

  ట్రైనర్ ఆసక్తికర వాఖ్యలు

  ట్రైనర్ ఆసక్తికర వాఖ్యలు

  ఇక సోనమ్ కపూర్ జిమ్ ట్రైనర్ ఒక మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఇలా అన్నాడు, "రెడ్ కార్పెట్ లో నడవాల్సినప్పుడు ఎక్కువగా స్లిట్ గౌన్లు మరియు బ్యాక్ లెస్ దుస్తులు ధరించాల్సి వస్తుందని, అందుకనే మేము లెగ్ వర్కౌట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. దానికి తగ్గట్టు బాడీ వర్కౌట్ పై ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఎందుకంటే అలాంటి దుస్తులు ధరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

  అరుదైన వ్యాధితో బాధ పడుతూ

  అరుదైన వ్యాధితో బాధ పడుతూ

  సోనమ్ కపూర్‌ చాలా సంవత్సరాల నుంచి ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతోంది. తాను యుక్తవయసులో ఉన్నప్పటి నుండి హార్మోన్ల రుగ్మత పిసిఒఎస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. తాను 14 లేదా 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటి నుంచి దీంతో బాధపడుతున్నానని పేర్కొంది. అయితే స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌తో దాన్ని కంట్రోల్ చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే పీసీఓఎస్ (పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌) సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంలో షుగర్ స్థాయి పెరుగుతుంది.

   సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె చివరిగా ఏకేvsఏకే సినిమాలో కనిపించింది. ఇక ప్రస్తుతం ఆమె బ్లైండ్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఆనంద్ అహుజాను వివాహమాడిన ఆమె సోనమ్ కపూర్ అహుజాగా మారింది. ఇక ఆమె మరిన్ని పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.

  English summary
  Today Sonam Kapoor celebrating her birthday. she made her debut with 'Saawariya' directed by Sanjay Leela Bhansali opposite Ranbir Kapoor. do you know she lost 35 kgs weigt for her debut.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X