Deepika Padukone దీపిక పదుకోన్‌కు షారుక్‌తో కాదు.. ఆ హీరోతోనే తొలి బోణి

ప్రపంచ ప్రఖ్యాత బాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే కూతురుగా పరిచయమైన దీపిక పదుకొన్ తన ప్రతిభాపాటవాలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్‌గా మారింది. అయితే ఆమె నటించిన తొలి చిత్రం ఓం శాంతి ఓం అనుకొంటారు. కానీ దీపిక పదుకోన్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా అది కాదు. వేరే ఉందనేది వాస్తవం. అయితే దీపిక పదుకోన్ నటించిన మొదటి చిత్రం ఏంటో మీకు తెలుసా?

దీపిక పదుకోన్ కెరీర్ బాలీవుడ్‌లో బ్రహ్మండంగా మొదలైంది. హిందీలో షారుక్ ఖాన్‌తో కలిసి ఓం శాంతి ఓం సినిమాలో నటించడం ద్వారా దేశవ్యాప్తంగా పరిచయమైంది. ఆ సినిమా హిట్ కావడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దాంతో ఆమె కెరీర్ తారాజువ్వలా దూసుకెళ్లింది. ఆ తర్వాత ఆమె వెనుకకు తిరిగి చూసుకోలేదు.

Deepika Padukone Story

అయితే హీరోయిన్‌గా ఎదగడమే కాకుండా హిందీలో స్టార్ హీరో రణ్‌వీర్ కపూర్‌తో ప్రేమలో పడింది. చాలా రోజులు డేటింగ్ చేసిన తర్వాత అతడిని పెళ్లాడింది. నటిగా రాణిస్తూనే నిర్మాతగా మారి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. ఇప్పటి వరకు 16 సంవత్సరాల్లో 40 సినిమాల్లో నటించింది.

అయితే హిందీలో ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఆమె తన తొలి చిత్రాన్ని కన్నడ భాషలో చేసిన విషయం అతి తక్కువ మందికి తెలుసు. 2007 నవంబర్ 9వ తేదీన రిలీజైన ఓం శాంతి ఓం సినిమా కంటే ముందుగా కన్నడ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. హీరో ఉపేంద్రతో కలిసి ఐశ్వర్య అనే చిత్రాన్ని 2006 సంవత్సరంలో చేసింది. అయితే ఈ సినిమా అనుకొన్నంత ఆడకపోవడంతో రావాల్సిన గుర్తింపు రాలేదని సినీ వర్గాలు వెల్లడించాయి.

ఇక దీపిక పదుకోన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ప్రభాస్ చిత్రం కల్కి 2898 ఏడీ (ప్రాజెక్ట్ K) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా నటిస్తుండటం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X