Kiss Day సుదీర్ఘమైన లిప్‌లాక్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? 90 ఏళ్ల రికార్డుకు దగ్గరగా కత్రినా, మల్లికా, కరిష్మా
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ప్రతీ సీన్‌లో ముద్దులు లేకుండా ఆశ్చర్య పడాల్సిందే. కానీ ఒకప్పుడు ఏదైనా మూవీలో చెంపపై ముద్దు పెట్టుకొంటేనే ఇండస్ట్రీలో పెద్ద సీన్ అయ్యేది.. దాని గురించి పెద్ద రాద్దాంతం జరిగేది. అలాంటి పరిస్థితులకు దూరంగా ఇప్పుడు సందర్భం ఉన్నా లేకపోయినా లిప్‌లాక్స్ సర్వసాధారణంగా మారుతున్నాయి. అయితే Kiss Day 2024 సందర్భంగా దాదాపు 90 ఏళ్ల క్రితమే ముద్దులతో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్ గురించిన వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో సంచలనం రేపిన సినిమాల్లో కర్మ ఒకటి. 1933 సంవత్సరంలో హిమాన్షు రాయ్ హీరోగా మారి నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రంలో తన భార్య దేవికా రాణినే హీరోయిన్‌గా పెట్టుకొన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలపై అప్పట్లో భారీగానే చర్చ జరిగింది. ఇప్పటికీ అదే కిస్ గురించి సినిమాల్లో రెఫరెన్స్‌గా తీసుకొంటారు.

కర్మ సినిమాలో హిమాన్షు రాయ్, దేవిక రాణి మధ్య చోటు చేసుకొన్న ముద్దు సీన్ సినిమా పరిశ్రమలో అదే తొలిసారి. వారిద్దరి మధ్య కిస్ సీన్ సుదీర్ఘమైనదని ఇప్పటికీ చెప్పుకొంటారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య సుమారుగా 4 నిమిషాలపాటు ముద్దు సీన్ ఉంటుంది. కేవలం ఇండియన్ సినిమాలోనే కాకుండా ప్రపంచ సినిమాలో ఈ ముద్దు అరుదైదని చెప్పుకొంటారు.
హిమాన్షు రాయ్, దేవికా రాణి మధ్య సాగిన సుదీర్ఘమైన 4 నిమిషాలపాటు ముద్దు సీన్ 90 ఏళ్ల పాటు కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ మధ్య మర్డర్ సినిమాలో 2 నిమిషాలపాటు, రాజా హిందూస్థాన్ చిత్రంలో అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య 2 నిమిషాలు, అనుష్క శర్మ, రణ్‌వీర్ సింగ్ మధ్య బ్యాండ్ బాజా బారాత్ సినిమాలో 2 నిమిషాలు ఉన్నాయి.

ఇక కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఫితూర్ సినిమాలో 3 నిమిషాల లిప్‌లాక్ ఉన్నది. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ నటించిన జందగీ నా మిలేగి దొబారా చిత్రంలో 3 నిమిషాల నిడివి ఉన్న ముద్దు సీన్ ఉన్నది. ఇప్పటి వరకు దేవికా రాణి, హిమన్షు మధ్య కర్మ మూవీలో ఇండియాలో లాంగెస్ట్ కిస్సింగ్ సీన్‌గా ఉండిపోయింది.
ఇక దేవికా రాణి కెరీర్ విషయానికి వస్తే.. కర్మ సినిమాతో యాక్టింగ్ ప్రారంభించిన ఆమె.. జవానీకి హవా, మమతా ఔర్ మియా, బీవీ, జీవన్ నైయా, జన్మభూమి, సావిత్రి, జీవన్ ప్రభాత్, ప్రేమ్ కహాని, అంజాన్, హమారీ బాత్ సినిమాల్లో నటించింది. జీవితంలో చోటు చేసుకొన్న విభేదాల కారణంగా హిమన్షుకు విడాకులిచ్చి.. రష్యన్ నటుడు నికోలాస్ రోరిచ్‌ను వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడింది.


Click it and Unblock the Notifications











