Samantha సినిమాలు చేయకపోయినా.. అలా కోట్లు సంపాదిస్తున్న సమంత.. నెల సంపాదన ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలు చేయకపోయినా ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది ఖుషి సినిమాతో పలకరించిన సమంత.. ఆ తర్వాత ఏ సినిమాను ఒప్పుకోలేదు. అయినా సమంత కోట్లకు కోట్లు సంపాదిస్తోంది. సినిమాలు, సిరీసులు, యాడ్ లు చేయకపోయినా... అలా చేస్తూ.. నెలకు రూ.4 కోట్లకు పైగానే సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సమంత సంపాదన ఎలా వస్తుందో ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై కొద్ది రోజులుగా భారీగా ట్రోలింగ్ రావడం సహజం అయిపోయింది. ఆమె ఏం చేసినా కూడా నెటిజెన్స్ మాత్రం ఆమెని ట్రోల్ చేస్తూనే.. వస్తున్నారు. ఏ డ్రెస్ వేసుకున్నా... బయటకు వచ్చి ఫోటోషూట్స్ చేసినా... నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లు సమంత సైతం గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. మొన్నటి వరకు మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సమంత.. ఇప్పుడేడిప్పుడే కోలుకుంటుందని తెలుస్తోంది.

Do You Know How Heroine Samantha Ruth Prabhu Gets Money Full Details Here

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నిత్యం సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది సమంత. హాట్ షోతో నెటిజన్స్ ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. వెకెషన్స్ బాట పట్టిన ఈ భామకు సంపాదన ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ భామ నటించిన చివరి చిత్రం ఖుషి.

ఖుషి సినిమా తర్వాత ఈ భామ మరే సినిమా ఒప్పుకోలేదు. అటు బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నప్పటికీ అది ఇంకా రిలీజ్ కాలేదు. అసలు ఎప్పుడు అవుతుందో క్లారిటీ అయితే లేదు. మొన్న నెటిజన్స్ తో చిట్ చాట్ నిర్వహించిన ఈ బ్యూటీ.. ఓ నెటిజన్ సిటాడెల్ అప్డేట్ అడిగితే..ఆ వెబ్ సిరీస్ దర్శకుడిని అడగమంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఈమె తన లైఫ్ ని లగ్జరీయస్ గా గడుపుతుంది.

నిజానికి సమంతకు స్థిరాస్తులు ఏమీ లేవు... మరోవైపు విడాకుల తర్వాత పెద్దగా సినిమాల్లో కూడా నటించడంలేదు.. అయినా సమంత తన లైఫ్ ను లగ్జరీగా గడుపుతుండడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అసలు సమంతకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. సినిమాలలో నటించకపోయినా, ట్రీట్మెంట్ కి ఖర్చు చేస్తున్నా... ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అంతా అనుకుంటున్నారు.

Do You Know How Heroine Samantha Ruth Prabhu Gets Money Full Details Here

అయితే సమంత సంపాదనకు కారణం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ అని తెలుస్తోంది. సమంతకి ఇన్ స్టాగ్రామ్ లో 31 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు పలు టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తుంది సమంత. కేవలం ఇన్ స్టాగ్రామ్ లో ఒక్క పోస్టు పెట్టి... బాగానే సంపాదన చేస్తుందట. అలా నెలకు 4 కోట్లకు పైగా సంపాదిస్తుందని సమాచారం. ఈ కారణంగానే ఆమెకు డబ్బు విషయంలో ఎటువంటి కొదవా లేదని అర్ధం అవుతుంది..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X