6 సంవత్సరాల్లో 15 డిజాస్టర్లు.. మణిరత్నం హీరోయిన్ కెరీర్ ఎలా పతనమైందో తెలుసా?
సినీ తారల జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అప్పటి వరకు స్టార్ స్టేటస్‌ను అనుభవించి మంచి జోష్ మీద ఉన్న తారలు.. తెల్లారే సరికి అధోపాతాళానికి పడిపోయిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఫలానా హీరో గానీ, హీరోయిన్‌కు ఇక ఢోకా లేదని అనుకొన్న సమయంలో వారు ఫ్లాపులతో కనుమరుగైపోతారు. అలా సినీ పరిశ్రమలో ఫేడ్ అవుట్ అయిన మణిరత్నం హీరోయిన్ మధుబాల డౌన్ ఫాల్ విషయానికి వస్తే..
తమిళ సినిమా పరిశ్రమలో నటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన తొలి చిత్రం పూల్ ఔర్ కాంటే సినిమాలో నటించింది. ఆ చిత్రం బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించడంతో ఆమె కెరీర్‌కు ఢోకా లేదని అందరూ అనుకొన్నారు. ఆ తర్వాత వెంటనే మణిరత్నం సినిమాలో నటించే ఆఫర్‌ను కొట్టేసింది.

తమిళంలో రూపొందిన రోజా సినిమా అప్పట్లో పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. ఈ చిత్రంలో మధుబాల నటించిన పాత్ర అందర్నీ ఆకట్టుకొన్నది. ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు క్రిటిక్స్ సైతం జై కొట్టారు. ఆ సినిమా సంచలనం విజయం సాధించడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకెళ్లింది. దాంతో స్టార్ హీరోయిన్‌గా ఆమె అవతరించింది.
హిందీ, తమిళంలో భారీ విజయాలు అందుకోవడంతో వెంటనే శంకర్ దర్శకత్వంలో జెంటిల్మన్ సినిమా ఆఫర్‌ను పట్టేసింది. ఆ సినిమా కూడా హిట్ కావడంతో ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్ల జాబితాలో చేరింది. అయితే తమిళ, తెలుగు సినిమాలను పక్కన పెట్టి హిందీ చిత్రాలు చేస్తూ మధుబాల తప్పు చేసింది.

అయితే 90వ దశకం ఆరంభం నుంచి చివరకు వరకు బిజీగా సినిమాలు చేసింది. దాదాపు 16 హిందీ చిత్రాల్లో నటించింది. అందులో ఒకట్రెండు తప్పా పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అప్పటికే తమిళం, తెలుగులో కొత్త హీరోయిన్లు వచ్చి స్పేస్‌ను ఆక్రమించడంతో మధుబాలకు అవకాశాలు తగ్గాయి. అలా ఆఫర్లు తగ్గడంతో పెళ్లి చేసుకొని కుటుంబ బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టింది.
అయితే ఇటీవల తమిళం, తెలుగులో బీ గ్రేడ్ సినిమాల్లో మధుబాల నటించింది. కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. తెలుగులో శాకుంతలం, తమిళంలో జయలలిత బయోపిక్ తలైవి చిత్రాలు నిరాశపరిచాయి. ఇటీవల గేమ్ ఆన్ అనే తెలుగు చిత్రంలో కీలక పాత్రను పోషించినా ఆ మూవీ పెద్దగా ఆడకపోవడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications











