Keerthy Suresh: నూతన గృహంలోకి కీర్తి సురేష్... విలాసవంతమైన భవనం ఎన్ని కోట్లంటే?
మహానటిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మాత్రం నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఆమె కల్కి 28988 మూవీలో భాగం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ తో పాటు ఆమె వుంటున్న ఇంటి ధర కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి కీర్తి సురేష్ నివసిస్తున్నారు లగ్జరీ హౌస్ ధర ఎంతో తెలుసుకుందాం పదండి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. తన క్రేజ్ కు తగ్గట్టుగానే ఆమె రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

కోలీవుడ్ మూవీ నిర్మాత సురేష్ కుమార్ నటి మేనక దంపతుల చిన్న కుమార్తె అయినా కీర్తి సురేష్ బాలనాటిగానే సినీ ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఇచ్చింది మాత్రం తెలుగు మూవీ మహానటి. ఈ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావట్లేదు.
ఈ నేపథ్యంలోనే ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం బీ టౌన్ నుంచి ఈ భామకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వరుణ్ ధావన్ సరసన ఇప్పుడు ఓ మూవీ చేస్తున్న కీర్తి సురేష్ మరో మూవీ ఆఫర్ ని కూడా కొట్టేసిందని టాక్ నడుస్తోంది. బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ చెన్నై చిన్నది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తేరీకి ఇది రీమేక్.
ఇక మరోవైపు కీర్తి సురేష్ కి ప్రస్తుతం సోషల్ మీడియాలో 17.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న కల్కి 2898 ఏడీ మూవీతో ఆమె ఫాలోయింగ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. తాజాగా రిలీజైన కల్కి 2898 ఏడీ ట్రైలర్ వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అందులో బుజ్జి అనే కార్ కు వాయిస్ ఓవర్ ఇస్తున్న కీర్తి గురించిన చర్చ మొదలైంది.

ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే ఇప్పటివరకు కీర్తి ఆస్తుల విలువ 41 కోట్లని సమాచారం. ఈ బ్యూటీ నెలకు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా 35 లక్షలు, సంవత్సరానికి 4 కోట్లు వెనకేసుకుంటుంది. అలాగే ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది. అలాగే కీర్తి ఇటీవల చెన్నైలో ఒక కొత్త విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసి అందులోకి వెళ్లింది. . దాని ఖరీదు గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది. వివిధ సౌకర్యాలతో కూడిన ఇల్లు విలువ దాదాపు 6 కోట్లు ఉంటుందని సమాచారం. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అలాగే ఆమెకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మరో అపార్ట్మెంట్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications











