13 ఏళ్లకే సినిమాల్లోకి .. 19 ఏళ్లకే కనుమరుగు... ఆ మహేష్ బాబు హీరోయిన్ ఎవరో తెలుసా?
ఫేమ్, స్టార్ డమ్ కోసం మంచి కెరీర్ ని వదిలేసి సినిమాల వైపు మళ్ళిన తారలు ఎంతమంది ఉన్నారు. అయితే కొద్దిమందికి మాత్రమే సినిమా ఇండస్ట్రీలో కోరుకున్న గుర్తింపు లభిస్తుంది. కానీ మరి కొంతమంది మాత్రం సక్సెస్ లేక కొన్ని సినిమాలకే సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటారు. అయితే ఓ నటి మాత్రం ఇండస్ట్రీలోకి 13 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి, 19 ఏళ్ళకే సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. అయితే ప్రస్తుతం ఆమె గూగుల్ లో ఓ మంచి జాబ్ చేస్తుండడం విశేషం. మరి ఇంతకీ ఈ నటి ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
1995 నుండి 2000 వరకు బాలీవుడ్‌లో తన నటనా కౌశలాన్ని చాటిన మయూరి కాంగో ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో మంచి పేరు సంపాదించుకుంది. ఒకప్పటి నటి మయూరి కాంగో మహేష్ బట్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ పిల్లి కళ్ల బ్యూటీ ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొన్నది.

అయితే ఆమె దక్షిణాదిన తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వంశీ అనే సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఆపై మయూరి కాంగో నర్గీస్, తోడా ఘం తోడా ఖుషీ, డాలర్ బాబు, కిట్టి పార్టీ లాంటి టెలివిజన్ షోలను కూడా చేసింది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అవకాశాలు కూడా కరువు అవ్వడంత సినిమాలో చిన్న పెద్ద పాత్రలు చేసిన ఈ బ్యూటీ ఒకానొక టైంలో ఇక సినిమా పరిశ్రమ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యింది.
చివరకు 2003 లో నటనను వదిలి ఎన్నారై ఆదిత్య ధిల్లాన్‌ను వివాహం చేసుకుని స్థిరపడింది. పెళ్లి తర్వాత మయూరి కాంగో తన భర్తతో కలిసి అమెరికా వెళ్లింది. అక్కడే మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారామె. 2004 నుంచి 2012 మధ్య అమెరికాలో పని చేసి, 2013లో తిరిగి భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో మయూరి కాంగో పెర్ఫార్మిక్స్ అనే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. 2019లో ఆమె గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్‌గా చేరారు.

విశేషమేమిటంటే బాలీవుడ్‌కి రాకముందు మయూరి కాంగో ఐఐటీ కాన్పూర్‌కు ఎంపికైంది. అయితే ఆమె నటి కావాలనే కోరికతో అడ్మిషన్ తీసుకోలేదు. అయితే ఐదేళ్లలోనే అదృష్టం బాగాలేక బాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పింది. ఆమె నటించిన 16 సినిమాలు ఇప్పటికి విడుదల కాలేదు.
విధి విచిత్రం వల్ల అలా ఇండస్ట్రీని వదిలేసినా మయూరిని పెళ్లయ్యాక మాత్రం అదృష్టం వరించింది. సినిమా ఇండస్ట్రీని వదిలేసి పట్టుదలతో టాప్ బిజినెస్ విమెన్ గా ఎదిగి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. సినిమాలు మాత్రమే లైఫ్ కాదని మయూరి నిరూపించింది.


Click it and Unblock the Notifications











