Deepika Padukone: కల్కి ఈవెంట్‌లో మెరిసిన దీపిక పదుకోన్.. ఆమె స్టైలిష్ డ్రస్ ధర ఎంతో తెలుసా?

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి డిమాండ్ ఉన్న నటి దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ 'కల్కి 2898 ఏడీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. తల్లి కాబోతున్న కారణంగా ఆమె సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుందేమో అనుకుంటే 6 నెలల ప్రెగ్నెన్సీ టైమ్ లో కూడా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొని సినిమా పట్ల తనకున్న ప్యాషన్ ను మరోమారు ప్రూవ్ చేసుకుంది. మరి ఈ ఈవెంట్ కోసం దీపిక ధరించిన బట్టల ధర ఎంతో తెలుసా? ఆ డ్రెస్ కాస్ట్ ఎంతో ఓ లుక్కేద్దాం పదండి.

దీపిక పదుకొనే తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి మొదటి బిడ్డకు స్వాగతం పలకడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ దంపతులు తమ ఫస్ట్ బేబీ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత దీపిక బయట ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె ప్రెగ్నెన్సీ పై అనుమానాలు తలెత్తాయి. అయితే 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో దీపికా పదుకొనే తన ఓటు వేయడానికి రణవీర్ సింగ్ తో కలిసి పోలింగ్ బూత్ కు వచ్చింది.

Do You know How Much Cost of Deepika Padukone black dress Cost wears in Kalki 2898 AD

అక్కడ కూడా ఆమె లుక్ చూసి తెగ ట్రోల్ చేశారు. దీపిక గర్భవతి కాదని, బేబీ బంప్ అంతా ఫేక్ అని, సరోగసి ద్వారా ఈ బ్యూటీ తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ట్రోల్స్ పై ముందుగా ఆమె భర్త రణవీర్ సింగ్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత దీపిక మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ భార్య అలియా భట్ తో పాటు పలువురు ప్రముఖులు ట్రోలర్స్ పై మండిపడ్డారు.

ఇక తాజాగా దీపిక కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన బేబీ బంప్ తో ప్రత్యక్షంగా కనిపించి అందరి నోళ్ళు మూయించింది. త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొనే ముఖంలో ఆ గ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈవెంట్ లో దీపిక బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టైలిష్ గా కనిపించింది. నిజానికి ముంబై పెద్దగా హడావిడి ఏమీ లేకుండా జరిగింది కల్కి 2898 ఏడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.

Do You know How Much Cost of Deepika Padukone black dress Cost wears in Kalki 2898 AD

ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ దీపికా పదుకొనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో ఆమె వేసుకున్న ఆ బ్లాక్ కలర్ బాడీ డ్రెస్ ధర ఎంత ? అని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజెన్లు. మొత్తానికి ఈ డ్రెస్ ను ఎక్కడ అమ్ముతున్నారో కనిపెట్టేసి, దాని ధరను కూడా పట్టేసి సోషల్ మీడియాలో పెట్టేశారు.

లోవే అధికారిక వెబ్‌సైట్‌లో దీపికా వేసుకున్న కాటన్ అనగ్రామ్ పెబుల్ డ్రెస్ అందుబాటులో ఉంది. ఆ డ్రెస్ ధర అక్షరాలా రూ.1,14,000. ఈ విషయం తెలుసుకుని దీపికా అభిమానులు ఈ సింపుల్ డ్రెస్ కోసం దీపికా ఇంత ఖర్చు పెట్టిందా అని షాక్ అవుతున్నారు. ఖర్చు సంగతి పక్కన పెడితే ఈ డ్రెస్ లో ఆమె బేబీ బంప్ తో కూడా స్టైలిష్ గా కంఫర్ట్ గా కన్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X