Alia Bhatt హాలీవుడ్ ఎంట్రీ.. Heart Of Stone మూవీ కోసం ఆలియా భట్ రెమ్యునరేషన్ ఎంతంటే?

సినిమా రంగంలో ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart of Stone). యాక్షన్ హీరోయిన్ గాల్ గ్యాడట్ నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తొలిసారి హాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు టామ్ హార్పర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకొన్న ఆలియా భట్ ఈ సినిమాలో నటించడం విశేషంగా మారింది. ఈ సినిమా గురించి.. ఈ సినిమా కోసం ఆలియాభట్ తీసుకొన్న రెమ్యురేషన్ గురించిన వివరాల్లోకి వెళితే..

హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart of Stone) సినిమా కథ విషయానికి వస్తే.. మాక్ గుఫిన్ అనే మిస్టీరియస్ శక్తిని ఎదుర్కొనేందుకు ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ రాచెల్ స్టోన్ (గాల్ గ్యాడెట్) ఓ మిషన్‌తో సిద్దమవుతున్నది. ఈ సినిమాలో కేయా ధావన్ అనే పాత్రలో ఆలియా భట్ నటించారు. హాలీవుడ్ సినిమాలో ఆలియా కనిపించడం ఇదే తొలిసారి కావడంతో ఆమె అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Do You Know How much Remuneration taken by Alia Bhatt for Gal Gadots Heart of Stone

గాల్ గ్యాడట్, జమ్మీ డొర్నన్, ఆలియాభట్, సోఫీ ఒకొనెడో, మ్యాథియాస్ తదితరులు నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart of Stone) ను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను సుమారుగా 80 మిలియన్ డాలర్ల వ్యయంతో తెరకెక్కించారు. భారతీయ కరెన్సీలో 660 కోట్ల రూపాయలతో నిర్మించారు.

ఇక హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart of Stone) మూవీలో ఆలియా భట్‌కు భారీ పారితోషికాన్ని అందించారు. ఈ సినిమాలో కేయా ధావన్ పాత్రలో నటించినందుకు గాను.. ఆలియా భట్‌కు 5 లక్షల డాలర్లు అంటే.. సుమారు 4.2 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌ ఇచ్చినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Do You Know How much Remuneration taken by Alia Bhatt for Gal Gadots Heart of Stone

ఇదిలా ఉండగా, ఆలియాభట్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన RRR చిత్రంలో సీత పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా ఆమె నటించిన రాకీ రాణి ఔర్ ప్రేమ్ కహానీ చిత్రం విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ క్రమంలో హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా రిలీజ్ అవుతున్నది.

Do You Know How much Remuneration taken by Alia Bhatt for Gal Gadots Heart of Stone

ఇక హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart of Stone) సినిమాను నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఆగస్టు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా నిడివి 123 నిమిషాలు. అంటే రెండు గంటల 3 నిమిషాలు మాత్రమే. అయితే అమెరికాలో వారం రోజుల ముందుగానే అంటే జూలై 4వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X