Sai Pallavi Remuneration: రామాయణంలో సీతకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఇండియాలోనే సాయిపల్లవికి టాప్ పారితోషికం
భారతీయ సినిమా పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న చిత్రం రామాయణ్. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ స్థాయిలో ఉన్న ఈ సినిమా సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. రణ్‌బీర్ కపూర్, యష్, సాయిపల్లవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న సాయిపల్లవి రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్త మీడియాలో సంచలనం రేపుతున్నది. ఆ పారితోషికం వివరాల్లోకి వెళితే..
భారతీయ ప్రజలకు స్పూర్తిగా నిలిచే సుందర దృశ్యకావ్యం రామాయణం. కాలాలు ఎన్ని మారినా.. ఈ కథపై వచ్చే సీరియల్స్, సినిమాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా బాలీవుడ్‌లో రామాయణం సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రం అనేక సంచలనాలకు వేదికగా మారుతున్నది.

రామాయణం సినిమాలో రాముడుగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో పాత్రను పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా కేజీఎఫ్ హీరో మారడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సాయిపల్లవి రెమ్యునరేషన్ వ్యవహారం అందర్నీ ముక్కున వేలేసుకొనే విధంగా చేసింది.
రామాయణం సినిమాలో సీత పాత్రను పోపిష్తున్న సాయి పల్లవికి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు 10 కోట్లకు మించి రెమ్యునరేషన్ అందుకొన్న హీరోయిన్లు అరుదుగా కనిపిస్తారు. కానీ ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పారితోషికం అందుకోబోతున్నది.

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. సాయిపల్లవికి రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకొన్నట్టు తెలిసింది. ఈ సినిమాలో నటించినందుకు గాను 50 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే విషయం కరెక్ట్ అయితే.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకొన్న హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు మార్మోగిపోతుంది.
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో హనుమాన్‌గా సన్నిడియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, దశరథుడిగా టీవీ సీరియల్ రాముడు అరుణ్ గోవిల్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్హాన్ సంగీతం అందిస్తున్నారు. నమితా మల్హోత్రా, శ్రీధర్ రాఘవన్ రచనా సహకారం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











