Priyanka Chopra neckless Price ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర ఎన్ని వందల కోట్లంటే? మెట్ గాలాలో గ్లోబల్‌స్టార్ హవా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ కెరీర్ ప్రస్తుతం రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. బాలీవుడ్ సినిమాలతోపాటు హాలీవుడ్ చిత్రాల చేయడమే కాకుండా టెలివిజన్ సిరీస్, టాక్ షోలు, ఈవెంట్లతో ఆమె బిజీగా మారిపోయింది. ఇటీవల ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌కు సంబంధించిన ఈవెంట్‌లో కూడా మెరిసింది. ఇలా ఈవెంట్లతో దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రా తాజాగా మెట్ గాలా ఈవెంట్‌లో సినీ ప్రపంచాన్ని మొత్తం తనవైపు తిప్పుకొన్నది. ఆమె ధరించిన జ్యూయెల్లరీ వరల్డ్ మీడియాలో చర్చనీయాంశమైంది. జ్యూయెల్లరీ, ప్రియాంక వ్యక్తిగత, ప్రొఫెషనల్ వివరాల్లోకి వెళితే...

సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా: ప్రియాంక చోప్రా సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆస్వాదిస్తుంటుంది. తన కూతురు, భర్తతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ సందడి చేస్తుంటుంది. తన పాప ఫోటోలను, భర్తతో రొమాంటిక్ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకొంటుంది. ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో ప్రియాంక పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవ్వడం తెలిసిందే. లేటు వయసులో ఆమె అందాలు చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

అమెజాన్‌లో ప్రియాంక చోప్రా సిటాడెల్ : ఇక ప్రొఫెషనల్‌గా ప్రియాంక చోప్రా కెరీర్ గ్రాఫ్‌ను పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పై సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. పూర్తి యాక్షన్, రొమాంటిక్‌గా రూపొందిన ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు రిచర్డ్ మ్యాడెన్‌తో కలిసి హాట్ హాట్‌గా నటించింది. ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా చేసిన స్టంట్స్, ఫైట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.

మెట్ గాలా 2023 ఈవెంట్‌లో : ఇలా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌ను బాగా లీడ్ చేస్తున్న ప్రియాంక చోప్రా తాజాగా అమెరికాలో పాపులర్ ఈవెంట్ మెట్ గాలా 2023 ఈవెంట్‌లో తన భర్త నిక్ జోనస్‌తో కలిసి సందడి చేసింది. లాంగ్ స్లిట్ గౌన్‌లో అందాలను ఆరబోస్తూ హాలీవుడ్ ప్రముఖులను తనవైపుకు తిప్పేసుకొన్నది. ప్రియాంక చోప్రా మెట్ గాలా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్త నిక్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

మెట్ గాలా వయ్యారంగా ప్రియాంక చోప్రా : మెట్ గాలా ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా గ్లామర్ ట్రీట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. నలుపు రంగు డిజైనర్ దుస్తుల్లో అందంగా మెరిసింది. మెట్ గాలా ర్యాంప్‌పై వయ్యారంగా నడుస్తూ.. అంతర్జాతీయ మీడియా కెమెరాల్లో నలిగిపోయింది. ముదరు వయసులో కూడా ప్రియాంక చోప్రా తనకు ఎదురు లేదనే విధంగా కనిపించింది. అయితే ఈవెంట్ కోసం ముస్తాబైన తీరు, లుక్ హాట్ టాపిక్‌గా మారింది.
హాట్ టాపిక్‌గా ప్రియాంక నెక్లెస్ ధర: ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ మెటా టాలా 2023 ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆమె 11.16 క్యారెట్ల బరువు ఉన్న బల్గరీ లగునా బ్లూ డైమండ్ నెక్లెస్‌ను ధరించింది. బల్గరీ జ్యువెల్లరీని అరుదైనదిగా, చాలా ఖరీదైనదిగా భావిస్తారు. మెటా గాలా 2023లో ఈ జ్యువెల్లరీని వేలం వేయడానికి సిద్దమవుతున్నారు. ఈ వేలంలో బల్గరీ నెక్లెస్ విలువ 25 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 204 కోట్ల రూపాయలు అని వెల్లడిస్తున్నారు.
మెట్ గాలా ఈవెంట్ ఎందుకు? : మెట్ గాలాను మెట్ బాల్, లేదా కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ గాలా, లేదా కాస్టూమ్ ఇనిస్టిట్యూట్ బెనిఫిట్ అని పిలుస్తారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ కోసం ప్రతీ ఏడాది నిధులను సేకరిస్తారు. ఈ నిధుల సేకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలను ఆహ్వానిస్తారు. మెట్ గాలా ఈవెంట్‌ను ప్రపంచంలోనే పాపులర్, మోస్ట్ గ్లామరస్ ఫ్యాషన్ ఈవెంట్‌గా చెప్పుకొంటారు.


Click it and Unblock the Notifications











