ది గోట్ మూవీలో స్నేహ రోల్‌ను మిస్ చేసుకొన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? విజయ్‌తో ఛాన్స్ అలా మిస్!
ఈ ఏడాదిలో మన స్టార్ హీరోస్ నుంచి ఒకింత తక్కువ సినిమాలే వచ్చాయి అని చెప్పాలి. అలాగే వచ్చిన వాటిలో చాలా వరకు పెద్ద హిట్స్ కూడా లేవు. మరి ఇది ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక పక్క స్టార్ హీరోల సినిమాలు లేక మరోపక్క హిట్ సినిమాలు కూడా పడక థియేటర్స్ వెలవెలబోయాయి. మరి ఈక్రమంలో వచ్చిన ఓ స్టార్ హీరో సినిమానే "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం".
కాగా విజయ్ దళపతి డ్యూయల్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఏదో అవుతుంది అనుకుంటే ఇది కూడా భారీ నష్టాలని మిగిల్చే సినిమా గానే మిగిలిపోయింది. కాగా ఈ చిత్రం కోసం అభిమానులు చూసిన ఎదురు చూపులకి దర్శకుడు పెద్ద దెబ్బే కొట్టాడు. దీనితో ఈ సినిమా విజయ్ కెరీర్ లో డిజాస్టర్ గానే నిలిచిపోయింది.

అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం బయటకి వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించిన సంగతి తెలిసిందే. ఒకరు సీనియర్ నటి స్నేహ కాగా మరో హీరోయిన్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించింది. అయితే వీరిలో సినిమాలో మీనాక్షి చౌదరి పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కానీ నటన పరంగా స్క్రీన్ టైం పరంగా చూసినా కూడా స్నేహ పాత్రకే మంచి మార్కులు ఇవ్వొచ్చు.
కానీ ఈ సినిమాలో అసలు స్నేహ రోల్ కి ఆమె మొదటి ఛాయిస్ కాదట. ఆమె ప్లేస్ లో మొదటిగా దర్శకుడు మరో స్టార్ హీరోయిన్ ని అందుకున్నారట. మరి ఆమె ఇంకెవరో కూడా కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార అట. మొదటగా ఆమె రోల్ ని దర్శకుడు వెంకట్ ప్రభు నయనతారకే చెప్పాడట. కానీ కొన్ని పరిస్థితులు రీత్యా నయనతార ఈ సినిమా చేయలేకపోవడంతో అది స్నేహ దగ్గరకి వెళ్లిందట.
కాగా ఈ సినిమా రిలీజ్ తర్వాత నయన్ సినిమా చూసి దర్శకుడు వెంకట్ ప్రభుతో మాట్లాడిందట. స్నేహ రోల్ ని బాగా చూపించారు అని ఆ రోల్ నేను చేయాల్సింది అని చెప్పుకొచ్చిందట. ఇలా ఈ రోల్ ని ఈమె ఈ సినిమాలో మిస్ అయ్యింది. కాగా ఈ చిత్రాల్లో విజయ్ చేసిన రెండు పాత్రలకి విజయ్ కూడా మొదటి ఛాయిస్ ఏమీ కాదు. మొదటిగా ఈ సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్ లతో చేద్దామనుకొని లాస్ట్ కి విజయ్ తో చేసాడు దర్శకుడు.

ఇక ఈ సినిమా తెలుగు సహా హిందీ కన్నడ భాషల్లో డిజాస్టర్ హా నిలిచిపోగా ఒక్క తమిళ్ లో ఓవర్సీస్ మార్కెట్ లో అది కూడా తమిళ్ వెర్షన్ లోనే మంచి వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాకి దర్శకుడు సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేయగా ఈ సినిమాని కూడా తాను తీస్తానని చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications











