మా ఆయనకు నాకంటే ఆ ముగ్గురు హీరోయిన్లు అంటేనే ఇష్టం.. కాజల్ షాకింగ్ కామెంట్స్

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమాతో బిజీగా మారింది. జూన్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అమ్మడు వరుస ప్రమోషన్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో కాజల్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందించకపోయినా.. కాజల్ కు మంచి అవకాశాలను తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా ఆడిషన్స్ కూడా ఎంతో విచిత్రంగా జరిగాయని కాజల్ చెప్పుకొచ్చింది.

ఆడిషన్ కు వెళ్ళినప్పుడు డైరెక్టర్ తేజ తనను ఏడవమని చెప్పారని తెలిపింది. "నేను.. నా లైఫ్ లో నాకు ఏడవడానికి రీజన్ ఏం లేదు, నాకు ఏడ్చే ఫీలింగ్ రావట్లేదు అని చెప్పాను. అప్పుడు మా నాన్న వచ్చి నేను ఏడ్చే విషయం ఒకటి చెప్పారు. దాంతో నేను ఏడ్చేశాను. ఆ ఆడిషన్ ఓకే చేసి నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు" అంటూ తెలిపింది. అలా కాజల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆ తరువాత చందమామ, మగధీర, డార్లింగ్, బృందావనం.. లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.

Do you know Kajal aggarwal s husband Gautam Kitchlu s Three favorite Telugu heroine Here are the names

మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్ లతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ కాజల్ మాత్రమే. ఆ రికార్డును ఇప్పటివరకు ఏ హీరోయిన్ బ్రేక్ చేయలేదు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని కరోనా లాక్ డౌన్ సమయంలో కాజల్ వివాహం చేసుకుంది. వీరికి 2022 ఏప్రిల్ 19న నీల్ అనే మగబిడ్డ పుట్టాడు.

పెళ్లి తరువాత ఆచార్యతో రీఎంట్రీ ఇస్తుందనుకున్న కాజల్.. బిడ్డ పుట్టాకా భగవంత్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ్ లో అడపాదడపా సినిమాలు చేసిన కాజల్.. కొద్దిగా గ్యాప్ తరువాత సత్యభామతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ ప్రమోషన్స్ కూడా ఎంతో వెరైటీగా చేస్తుంది. ఎప్పుడు లేనిది ఆమె కుటుంబంలోని వ్యక్తులను పరిచయం చేస్తూ వారి జీవితాల్లో కాజల్.. సత్యభామ రోల్ ఎలా ప్లే చేసింది చెప్పించింది.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కాజల్.. తనభర్తకు నచ్చిన హీరోయిన్స్ లిస్ట్ చెప్పుకొచ్చింది. "గౌతమ్ నాకు ఎప్పుడు సపోర్ట్ గా నిలబడతాడు. తనవలనే నేను ఇక్కడ ఉన్నాను. ఆయన నా సినిమాల విషయంలో జోక్యం చేసుకోడు. కానీ, ఫ్రీ సమయంలో తెలుగుతో పాటు అన్ని సినిమాలను చూస్తూ ఉంటాడు. ఆయనకు నాకంటే సమంత, రాశీఖాన్నా, నయనతార, రష్మిక నటన అంటే ఎంతో ఇష్టం" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి మొదటిసారి కాజల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. అందులోనూ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా .. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X