Year End 2023 గూగుల్ టాప్ సర్చ్‌లో రాంచరణ్ హీరోయిన్..హాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్ భామ షాక్
ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంఘటనలతో 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకొన్నది. ఇంకా కొద్ది రోజుల్లో 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. ఈ ఏడాదిలో గొప్ప సంఘటనలు, విశేషాలను గుర్తు చేసుకొంటూ ఈ ఏడాదికి గుడ్‌బై చెప్పడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ ఏడాది గూగుల్‌లో అత్యదిక మంది సర్చ్ చేసిన హీరోయిన్ ఎవరనే వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత సంవత్సరంలో సినీ పరిశ్రమలోకి కొత్త కొత్త తారలు తమ ప్రతిభను చాటుకోవడమే కాకుండా మంచి పాపులారిటీని సంపాదించుకొన్నారు. ఈ ఏడాదిలో రష్మిక మందన్న, తృప్తి డిమ్రీ లాంటి తారలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ప్రియాంక, దీపిక పదుకొన్ లాంటి వాళ్లు ప్రపంచ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయితే వీళ్లెవరి గురించి కూడా నెటిజన్లు వెతకలేదనే విషయం ఆసక్తిని రేకెత్తించింది.

అయితే 2023 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా వెతికిన హీరోయిన్లలో టాప్‌గా నిలిచిన తార కియారా అద్వాని. తన భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో వివాహం తర్వాత ఆమె సత్యప్రేమ్ కీ కథ అనే చిత్రంలో నటించారు. అయితే పెద్దగా హిట్ లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో ఎక్కువ మంది నెటిజన్లు కియారాను వెతికారనే వార్త సంచలనంగా మారింది.
2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ సర్చ్‌డ్ ఉమెన్ జాబితాలో కియారా అద్వానీ, వెడ్నస్ డే వెబ్ సిరీస్ ఫేమ్ జెన్నా అర్టేగా టాప్‌లో నిలిచారు. అయితే కియారా స్పీడ్ ముందు గ్యాల్ గ్యాడెట్ లాంటి వాళ్లు కూడా చిత్తైపోయారు. అయితే టాప్ 10 లిస్టులో దీపిక, ప్రియాంక, ఆలియా భట్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ హీరోయిన్లను కాకుండా కియారా అద్వానీ గురించి నెటిజన్లు సర్చ్ చేశారనే వార్త ఆమె అభిమానులను ఆనందంలో ముంచేసింది. కియారాకు ఇలాంటి ఘనత దక్కడంపై బాలీవుడ్ వర్గాలు కూడా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కాలంలో బలమైన పాత్రలతో కియారా ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
కియారా అద్వానీ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నది. రాంచరణ్‌తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు ఇంకా చర్చలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











