స్కంధ సినిమాలో కృతిశెట్టి.. ఎక్కడ కనిపించిందో మీరేమైనా గుర్తు పట్టారా?
కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇవే కాకుండా ఈ క్యూట్ బ్యూటీ స్కంధ సినిమాలో కూడా నటించిందట. ఆమెను తన అభిమాని ఆ సినిమాలో చూశాడట. మీరేమైనా గుర్తించారా.
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీయే స్కంధ. అయితే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే 2023 సెప్టెంబర్ 28వ తేదీన తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అది కూడా అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో కృతి శెట్టి ఉన్న విషయం మాత్రం మనకెవరికీ తెలియదు. కానీ కృతిపై విపరీతమైన అభిమానం కల్గిన ఓ వ్యక్తికి మాత్రం ఆమే కనిపించిందట.

అయితే ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన కృతి శెట్టికి ఈ అనుభవం ఎదురైంది. చాలా మంది హీరోయిన్లకు అభిమానుల నుంచి వెరైటీ వెరైటీ ఘటనలు ఎదరు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది తమ అభిమాన నటితో ఫొటోలు దిగాలని లేదా సెల్ఫీలు తీసుకోవాలని లేదా ఆమెను తాకాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్లకు కంఫర్ట్ గా ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా తోసుకు వెళ్తుంటారు. కానీ ఇలాంటివేవీ కాకుండా.. కృతి శెట్టికి ఓ వింత అనుభవం ఎదురైంది.
ఓ ప్రారంభోత్సవానికి వెళ్విన కృతి శెట్టి ఆ తర్వాత ఆమె తన అభిమానులు అందరితో మాట్లాడుతూ.. ఫొటోలు కూడా దిగింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని వచ్చి హాయ్ మేడం.. స్కంధ సినిమా చాలా బాగుందని అని చెప్పాడు. అవునా ఓకే అని చెప్పిన కృతి శెట్టి... ఆ తర్వాత క్యూట్ గా నేను ఆ సినిమాలో లేను అని నవ్వుతూ చెప్పింది. అది విన్న అక్కడి వాళ్లంతా ఒకటే నవ్వడం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే మీరు ఈ వీడియోను చూశారా.. లేదంటే ఒక్కసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. కడుపుబ్బా నవ్వుకోండి.


Click it and Unblock the Notifications











