రష్మిక మందన్నాకు నాగ శౌర్య అన్నయ్య అవుతాడట... సీక్రెట్ రివీల్ చేసిన హీరో తల్లి!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చి.. గీతా గోవిందం సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కూర్గ్ భామ బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో చేస్తుంది. ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. వరుసగా అవకాశాలు దక్కించుకుని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూనే ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య.. రష్మిక మందన్నాకు అన్నయ్య అవుతాడట. అదెలా సాధ్యం.. ఛలో సినిమాలో రొమాన్స్ చేసిన వీరు అన్నాచెల్లెల్లు ఎలా అవుతారు అనిపిస్తోంది కదా. రీల్ లైఫ్ లో అలా చేసినా రియల్ లైఫ్ లో మాత్రం అన్నాచెల్లెల్లేనట. అయితే వీరిద్దరి మధ్య బంధం గురించి ఎవరో చెబితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. నేరుగా నాగశౌర్య తల్లే ఈ మాటలు చెప్పింది. నాగశౌర్య, రష్మికలు అన్నా చెల్లెల్లు అవుతారంటూ చెప్పి షాకిచ్చింది. అసలు వీరిద్దరూ అన్నాచెల్లెల్లు ఎలా అయ్యారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Naga Shourya And Rashmika Mandana Brother And Sister Ralationship

నాగశౌర్య తల్లి ఉషా ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈక్రమంలోనే తాము స్థాపించిన ఐరా బ్యానర్ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. తాము హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ తో పాటు డైరెక్టర్ కూడా టాప్ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఛలో సినిమా ద్వారా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను తామే సినీ రంగానికి పరిచయం చేశామని.. ఆమె ఇప్పుడు టాప్ హీరోయిన్ గా మారినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో చేసేందుకు ముందుకు రష్మిక పెద్దగా ఆసక్తి చూపలేదని కూడా ఉషా ప్రసాద్ వివరించారు.

OTTలోకి నవ్విస్తూనే భయపెట్టే నయా సూపర్ హిట్ ఫిల్మ్ .. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలంటే?
https://telugu.filmibeat.com/ott/regina-cassandra-conjuring-kannappan-movie-ott-details-here-130531.html

ముఖ్యంగా కన్నడలోనే అనేక అవకాశాలు వస్తుండగా... ఇక్కడి వరకు వచ్చి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని రష్మిక తల్లిదండ్రులు ఛలో సినిమాకు నో చెప్పారట. కానీ తామే దగ్గరుండి ఓ మనిషిని పంపించగా.. ఇంటికి వచ్చి మరీ తమతో మాట్లాడాకా ఓకే చెప్పారట. షూటింగ్ ప్రారంభం అయిన ముందు రోజుల్లో రష్మిక తల్లిదండ్రులు ఆమెకు తోడుగా వచ్చేవారని.. కానీ తాము ఆమెకు అలవాటు అయ్యాక ఒంటరిగానే రావడం ప్రారంభించిందని ఉషా ప్రసాద్ స్పష్టం చేశారు. అంతేకాదండోయ్.. వీరి ఏర్పడిన అభిమానంతో నాగౌశౌర్య తల్లిదండ్రులను... రష్మిక మమ్మీ, డాడీ అని కూడా పిలిచేదట.

Do You Know Naga Shourya And Rashmika Mandana Brother And Sister Ralationship

ఇలా ప్రతిరోజూ మమ్మీ, డాడీ అని పిలుస్తూ.. తమతో చాలా క్లోజ్ గా ఉండేదని నాగశౌర్య తల్లి ఉషా ప్రసాద్ వివరించారు. ఇలా నాగశౌర్య తల్లిదండ్రులను అమ్మా, నాన్నలు అని రష్మిక పిలవడంతో... నాగశౌర్య అన్నయ్యగా మారిపోయాడు. ఇలా తొలిసారి తమ మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టంది ఉషా ప్రసాద్. అలాగే ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు కొడుతున్నాడని.. అతడు కూడా తనకు కొడుకు లాంటి వాడేనని ఉషా ప్రసాద్ వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X