Nayanatara బాలీవుడ్ ఎంట్రీ.. జవాన్ సినిమాకు నయనతార రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ప్రివ్యూ వీడియో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్‌ను జూలై 10వ తేదీన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రివ్యూ వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కుతున్నది. అయితే ఈ సినిమా ద్వారా తమిళ రంగానికి చెందిన ముగ్గురు ప్రముఖులు నయనతార, విజయ్ సేతుపతి, అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార రెమ్యునరేషన్ బాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే బాలీవుడ్ ఎంట్రీ సినిమాకు నయనతార ఎంత పారితోషికం తీసుకొన్నదనే వివరాల్లోకి వెళితే..

దక్షిణాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో అగ్ర నటిగా మారిన నయనతారకు గతంలో హిందీ సినిమా పరిశ్రమ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. అయితే బాలీవుడ్ ప్రముఖుల ఆఫర్లను మొహమాటం లేకుండా తిరస్కరించింది. అయితే ఎవరూ ఊహించిన విధంగా జవాన్ సినిమాలో నయనతార నటించడం సెన్సేషన్‌గా మారింది.

Do you know Nayanataras Remuneration for Shah Rukh Khans Jawan Movie?

దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లడానికి ఇష్టపడని నయనతార.. దర్శకుడు అట్లీ కోరిక మేరకు ఒకే చెప్పింది. తన దర్శకత్వంలో నటించాలని కోరిన వెంటనే ఆమె ఒప్పుకొన్నారు. నయనతారకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రావడంతో నయనతార ఒప్పుకోకుండా ఉండని పరిస్థితి ఏర్పడింది అని జవాన్ చిత్ర యూనిట్ వెల్లడించింది.

అయితే నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంలో షారుక్ ఖాన్‌ది కూడా ప్రధాన పాత్రే. దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న నయనతార ఉండటం వల్ల కలెక్షన్ల పరంగా మంచి రేంజ్ ఉంటుంది. విజయ్ సేతుపతి, ప్రియమణి లాంటి హీరోయిన్లతో ప్రేక్షకులు జవాన్ సినిమాను సౌత్ సినిమా ఓన్ చేసుకొంటారనే అభిప్రాయంతో షారుక్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.

Do you know Nayanataras Remuneration for Shah Rukh Khans Jawan Movie?

జవాన్ మూవీ ప్రివ్యూ రిలీజ్ తర్వాత నయనతార రెమ్యునరేషన్ విషయం మీడియాలో మరోసారి చర్చ జరిగింది. ఈ సినిమాలో నటించడానికి నయనతారకు దాదాపు 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా అందజేసినట్టు సమాచారం. ప్రస్తుతం నయనతార దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకోనే హీరోయిన్‌గా రికార్డు సొంతం చేసుకొన్నారు.

జవాన్ సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని వాస్తవానికి జూన్ 2వ తేదీన రిలీజ్ చేయాలని అనుకొన్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X