Animal మూవీని వదులుకొన్న స్టార్ హీరోయిన్.. రష్మికకు లక్కీ ఛాన్స్ ఇచ్చిన గ్లామర్ తార ఎవరంటే?

హిందీ సినిమా పరిశ్రమతోపాటు దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసిన యానిమల్ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు భార స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన ఫెర్ఫార్మెన్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో రష్మిక నటించిన గీతాంజలి పాత్రను వదులుకొన్న హీరోయిన్ ఎవరనే విషయంలోకి వెళితే..

యానిమల్ సినిమాలో రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర కేవలం గ్లామర్‌కు పరిమితం కాలేదు. అందం, అభినయాన్ని ప్రదర్శించేందుకు స్కోప్ ఉన్న పాత్రలో ఆమె చెలరేగిపోయింది. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి చేసిన రొమాన్స్, వారిద్దరి మధ్య ఉన్న శృంగార సన్నివేశాలు, అలాగే రొమాంటిక్ డైలాగ్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నాయి.

 Do You Know Parineeti Chopra dropped from Animal: This is the reason Rashmika Mandanna roped for Geetanjali Role?

పుష్ప తర్వాత రష్మిక మందన్నకు భారీ ఆదరణ ఉత్తరాదిలో కనిపించింది. ఈ సినిమా తర్వాత నేషనల్ క్రష్‌గా మారింది. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా బాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయాయి. అయితే తాజాగా రిలీజైన యానిమల్ సినిమాలో స్ట్రాంగ్ ఉమెన్ పాత్రలో అద్బుతంగా రాణించింది.

అయితే యానిమల్ సినిమాలోని గీతాంజలి పాత్రకు ముందుగా పరిణితి చోప్రాను తీసుకొన్నారు. 2021లో ఈ సినిమాను ప్రారంభించినప్పుడు పరిణితి చోప్రా నటించేందుకు ఒప్పుకొన్నారు. అయితే ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో రూపొందే అమర్ సింగ్ చమ్కిలా సినిమా రెండు ఒకేసారి షూటింగ్ చేయాల్సి వచ్చింది. దాంతో యానిమల్ సినిమాను వదులుకొని చమ్కిలాకు ఓటేసింది అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వచ్చాయి.

 Do You Know Parineeti Chopra dropped from Animal: This is the reason Rashmika Mandanna roped for Geetanjali Role?

అయితే తొలుత రణ్‌బీర్ కపూర్ సరసన పరిణితి చోప్రాను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీసుకొవాలనుకొన్నాడు. కానీ ఆ తర్వాత ఆ పాత్రకు ఆమె ఫిట్ కాదని భావించాడు. ఆ కారణంగానే పరిణితి చోప్రాకు బదులుగా రష్మిక మందనను ఆయన తీసుకొన్నాడు. అయితే తనను యానిమల్ సినిమా నుంచి తీసేయడం పట్ల సందీప్ రెడ్డి వంగాపై పరిణితి చోప్రా తీవ్ర అంసతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.

బాలీవుడ్‌లో వికీ కౌశల్ నటించిన సామ్ బహద్దూర్ సినిమాతో భారీ పోటీ మధ్య యానిమల్ మూవీ రిలీజైంది. సాన్య మల్హోత్రా, ఫాతీమా సనా షేక్ నటించిన సామ్ బహద్దూర్ కేవలం హిందీలో రిలీజ్ కాగా, యానిమల్ చిత్రం హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో రిలీజైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X