Pooja Hegde: పూజా హెగ్డే ఆస్తిపాస్తుల గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే, బానే వెనకేసినట్లుందిగా!

Pooja Hegde: పూజా హెగ్డే.. ఈ బుట్ట బొమ్మ తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లోనే తన గ్లామర్ తో చెరగని ముద్ర వేసింది. రెండో సినిమా ముకుంద వరుణ్ తేజ్ సరసన తన గ్లామర్ ఒలకబోసింది. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు అందుకుని తెలుగులో మంచి పేరు, గుర్తింపు, అభిమానులను సంపాదించుకుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో తన నటనతో, అందంతో మెప్పించి తెలుగు వారి మనసుల్లో చోటు సంపాదించుకుంది. బుట్ట బొమ్మగా చెరగని ముద్ర వేసింది. అయితే ఈ అమ్మడు ఇటీవల నటించిన సినిమాలేవీ ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోయాయి.

రాధేశ్యామ్ మొదలు, ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య.. ఈ మూడు సినిమాలు ఫ్లాప్ టాక్ అందుకున్నాయి. అలా వరుస ఫ్లాపులు మూటగట్టుకుని, గతంలోలాగా ఐరెన్ లెగ్ అనే అభిప్రాయాన్ని తెచ్చిపెట్టుకుంది. పూజా హెగ్డె మొదట్లో నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు. అలా ఈ బ్యూటీ బ్యాడ్ అనే ముద్ర పడిపోయింది. ఆ తర్వాత వరుసగా బుట్ట బొమ్మ నటించిన సినిమాలు హిట్ కావడంతో ఆ ముద్ర చెరిగిపోయింది. కానీ, మరోసారి వరుసగా ఫ్లాపులు వస్తుండటంతో.. పూజా టైం బ్యాడ్ స్టేజ్ లో ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి.

Do You Know Pooja Hegde Have How Many Cars And Building Check Details here

వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న ఈ బ్యూటీకి తొలగింపులు కూడా తలనొప్పిగా మారాయి. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాల దర్శన నిర్మాతలు పూజను పక్కన పెట్టి వేరే హీరోయిన్లను తీసుకున్నారన్న విషయం తెలిసిందే. ఈ బ్యాడ్ స్టేజ్ లోనే పూజాకు నేనున్నానంటూ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండగా నిలిచి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో పూజాను తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతోంది. అంతకుముందు.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లోనే పూజానే హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ పక్కన త్రివిక్రమ్ దర్శకత్వంలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి పూజాకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

పుష్ప: ది రూల్ రిలీజైన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 2024 ఏప్రిల్ నుంచి వరుస షూటింగ్ జరుపుకుంటుందని టాక్. 2025 సంక్రాంతి బరిలో నిలిచేలా ఈ సినిమాను ప్లాన్ చేశారట దర్శక నిర్మాతలు. ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తాడు. ఇదిలా ఉంటే.. బుట్ట బొమ్మ బాగానే కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఈ అమ్మడి వద్ద మూడు కాస్ట్లీ కార్లు ఉన్నాయట.

Do You Know Pooja Hegde Have How Many Cars And Building Check Details here

2 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒక పోర్షే కారుతో పాటు కోటి రూపాయల విలువైన లగ్జరీ జాగ్వార్ కారు, ఆడి Q7 కారు కూడా పూజా గ్యారేజీలో ఉన్నట్లు సమాచారం. ఈ హై ఎండ్ కార్లతో పాటు బీఎండబ్ల్యూ 350డి, ఇన్నోవా క్రిస్టా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా.. మంచి జోరు మీద ఉన్నప్పుడే ఆస్తులు కూడ బెట్టుకోవాలని పూజా స్థిరాస్తులనూ కొనుగోలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో ఒక ఒల్లు, ముంబైలో మరో ఇల్లు పూజా పేరిట ఉన్నాయట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X