Poonam Pandey: పూనమ్ పాండే టోటల్ ఆస్తులు ఎంతో తెలుసా? శృంగార తార‌గా ఎన్ని చిత్రాల్లో నటించిందంటే?

బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే ఆకస్మిక మరణం అభిమానులను, సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. కొద్దికాలంగా సర్వికల్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె గురవారం తుదిశ్వాస విడిచారని పూనమ్ పాండే మేనేజర్ అధికారికంగా వెల్లడచడంతో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు షాక్ గురయ్యారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

శృంగార తారగా సుపరిచితులైన పూనమ్ పాండే ది అన్ క్యానీ అనే షార్ట్ ఫిలింతో కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత నషా అనే సినిమా ద్వారా హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అనతరం లవ్ ఇన్ పాయిజన్ చిత్రంతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అదాలత్ మూవీతో భోజ్‌పురి భాషలో నటించారు.

Do You Know Poonam Pandeys Total Assets and Luxury Cars detais

పూనమ్ పాండే తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి పరిచయం ఉంది. ఆమె మాలిని అండ్ కో సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హిందీలో జీఎస్టీ, ది జర్నీ ఆఫ్ కర్మ అనే చిత్రాల్లో నటించింది. ఇక టెలివిజన్‌ రంగంలో ఫియర్ ఫ్యాక్టర్, లాకప్ అనే రియాలిటీ షోలో నటించింది.

అయితే బాలీవుడ్‌లో రాజ్ కుంద్రాకు సంబంధించి పోర్న్ స్కాండల్ కేసులో పూనమ్ పాండే పేరు వినిపించడం సంచలనం రేపింది. ఈ విషయంలో రాజ్ కుంద్రాపై హైకోర్టులో కేసు బుక్ చేసింది. తనతో కాంట్రాక్టు ముగిసిన తర్వాత కూడా రాజ్ కుంద్రా, ఆయన సహచరులు అనైతికంగా తన కంటెంట్‌ను ఉపయోగించుకొన్నారని చెప్పింది.

Do You Know Poonam Pandeys Total Assets and Luxury Cars detais

ఇదిలా ఉంటే.. పూన్ పాండేకు విలాసవంతమైన జీవితం అంటే ఇష్టం. మోడల్‌గా, హీరోయిన్‌గా రాణిస్తునే ఖరీదైన వాహనాలు, నివాసాల్లో జీవించారు. ఆమెకు అత్యంత ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఆమెకు మెర్సిడెజ్ ఈ క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్లు ఉన్నాయి. వాటి ఖరీదు సుమారుగా 2 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

కాన్పూర్‌కు చెందిన పూనమ్ పాండే మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదిగి టాప్ రెమ్యునరేషన్ తీసుకొనే శృంగార తారల్లో ఒకరిగా ఉన్నారు. తాజా అంచనా ప్రకారం ఆమె ఆస్తి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఆమె మరణం సినీ ప్రముఖులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X