Priyanka Chopra ప్రియాంక చోప్రా నటించిన తెలుగు సినిమా గురించి మీకు తెలుసా? హీరో ఎవరంటే?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ ఇంటి గెలిచి రచ్చ గెలిచిన హీరోయిన్. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే పట్టుదల ఉన్న బాలీవుడ్ హీరోయిన్.. కేవలం హిందీ సినిమాకే తన టాలెంట్‌ను పరిమితం కానివ్వలేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉండగానే.. హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ కూడా అందర్ని మెప్పిస్తున్నది. అలాంటి హీరోయిన్ తెలుగు సినిమాలో నటించిన విషయం మీకు తెలుసా?

ప్రియాంక చోప్రా తన కెరీర్ ను మోడల్‌గా మొదలుపెట్టింది. 2002 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరిటాన్ని సొంతం చేసుకోగానే బాలీవుడ్ నుంచి కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చాయి. కానీ కెరీర్‌ను బాగా ప్లాన్ చేసుకోవాలనే బలమైన కోరిక ఉన్న ఈ ముద్దుగుమ్మ పరభాషలోకి ప్రవేశించింది. తమిళంలో తన కెరీర్‌ను ప్లాన్ చేసుకొన్నది. ప్రస్తుత సూపర్ స్టార్ విజయ్‌తో తమిజాన్ అనే తన తొలి చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

Do You Know Priyanka Chopra acted in Telugu Film Here is the Hero and project details

ఇక తమిళ సినిమా తర్వాత హిందీలో వచ్చిన వరుస అవకాశాలను చేజిక్కించుకొన్నది.అందాజ్ సినిమా హిట్ కావడంతో ప్రియాంక చోప్రా వైపు నిర్మాతల చూపు పడింది. అభిషేక్ బచ్చన్‌తో ముజే షాదీ కరోగి సినిమాతో పాపులారిటీ సాధించింది. ఐత్‌రాజ్ సినిమాలో ఆమె నటనకు ఉత్తమ విలన్ అవార్డును అందుకొన్నది. దాంతో ప్రియాంక చోప్రాపై దర్శకుల గురి బాగా కుదిరింది.

ఇక క్రిష్, డాన్, ఫ్యాషన్, దోస్తానా, కమినే, అంజానా అంజానీ లాంటి సినిమాలు ఆమె స్టార్ రేంజ్‌ను పెంచాయి. రా.వన్, డాన్ 2, అగ్ని పత్ చిత్రాలు ఆమెను సూపర్ స్టార్ పీఠంపై కూర్చోబెడితే.. బర్ఫీ చిత్రం ఆమెను ఉత్తమ నటిగా గుర్తించేలా చేసింది.మేరీ కోమ్, బాజీరావు మస్తానీ లాంటి సినిమాలు స్టార్ హీరోయిన్‌గా ఆమె స్థానాన్ని పదిలం చేశాయి.

Do You Know Priyanka Chopra acted in Telugu Film Here is the Hero and project details

ఇక బాలీవుడ్‌లో సక్సెస్ జోష్ కొనసాగిస్తూనే బేవాచ్ అనే పాపులర్ సిరీస్ ద్వారా హాలీవుడ్‌లొకి అడుగుపెట్టింది. ఏ కిడ్ లైక్ జేక్, ఇజ్ ఇంట్ ఇట్ రొమాంటిక్, చేజింగ్ హ్యాపీనెస్, ది స్కై ఈజ్ పింక్, హ్యాపీనెస్ కంటిన్యూస్, వీ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్, ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్, లవ్ అగైన్, సిటాడెల్ లాంటి చిత్రాల్లో నటించడమే కాకుండా హాలీవుడ్ క్రిటిక్ ప్రశంసలు అందుకొన్నది.

ఇక ఇవన్నీ ఇలా ఉంటే.. ప్రియాంక చోప్రా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగు సినిమాలో కూడా నటించింది. అపురూపం అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం, పెద్దగా ఆ సినిమా ఆదరణ పొందలేకపోవడంతో ఆమెకు అవకాశాలు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఈ సినిమాలో ప్రసన్న హీరోగా నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X