లెజండరీ డైరెక్టర్ మూవీలో నగ్నంగా.. దావూద్‌ ఇబ్రహీంతో అఫైర్‌.. కెరీర్‌ను నాశనం చేసుకొన్న తెలుగు హీరోయిన్ ఎవరంట

గ్లామర్ మెరుపుల మాటున సినిమా తారల జీవితాలు గాలి బుడగల్లా పేలిపోతుంటాయి. ఈ రోజు సూపర్ స్టార్ అని విర్రవీగే లోపే ఊహించని విధంగా కిందపడిపోతుంటారు. నిన్నటి వరకు నిర్మాతలు క్యూ కట్టిన హీరోయిన్‌కు తెల్లారితే ముఖం చాటేసిన దాఖలాలు కూడా ఉంటాయి. ఇలాంటి తారలు సినిమా ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారు. సినిమా పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్ రూపొందించిన చిత్రంలో న్యూడ్‌గా నటించడమే కాకుండా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన హీరోయిన్.. దావూద్ ఇబ్రహీం కారణంగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన తార జీవితం వివరాల్లోకి వెళితే..

మందాకిని విషయానికి వస్తే.. హిందీ, తెలుగులో ఒకేసారి సినీ పరిశ్రమకు పరిచయమైంది. 1985 సంవత్సరంలో మేరా సాథీ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అదే సమయంలో దిగ్జజ నిర్మాత, దర్శకుడు రాజ్‌కపూర్ దర్శకత్వంలో రూపొందిన రామ్ తేరీ గంగా మైలీ చిత్రంలో శృంగారాన్ని ఒలకబోసింది.

Do You Know Ram Teri Ganga Maili fame Mandakini spoiled career due to affair with Dawood Ibrahim

రాజ్ కపూర్ కుమారుడు చింపూ సరసన మందాకిని హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో ఆజారే అనే పాటలో ఆమె పండించిన గ్లామర్ పంట ఇప్పటికీ యువతకు గిలిగింతలు పెడుతుంది. ఆ పాట అప్పట్లో సంచలనం రేపింది. ఆ పాటలో ఆమె క్షణాలపాటు నగ్నంగా కనిపించడంతో సినిమాను యువత పిచ్చెక్కినట్టు చూశారు.

Do You Know Ram Teri Ganga Maili fame Mandakini spoiled career due to affair with Dawood Ibrahim

మేరే సాథీ, రామ్ తేరీ గంగా మైలీ సినిమా రూపొందిన సంవత్సరంలోనే సూపర్ స్టార్ కృష్ణ నిర్మించి దర్శకత్వం వహించిన సింహాసనం సినిమాలో విష కన్య పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. సింహాసనం సినిమాలో వహ్వా నీ యవ్వనం పాటలో ఆమె చూపించిన హోయలు అప్పట్లో కుర్రకారును కిరాక్ ఎత్తించింది. ఆ తర్వాత భార్గవ రాముడు సినిమాలో బాలకృష్ణ సరసన రోజా పాత్రలో గ్లామర్ పంట పండించింది.

తెలుగులో పెద్దగా నటించకపోయినా జాల్, డ్యాన్స్ డ్యాన్స్, కమాండో, హమ్ తో చలే పరదేశ్, జంగ్ బాజీ, లడాయి. తేజాబ్, దుష్మన్ సినిమాలో నటించింది. ఆ తర్వాత ప్యార్ కా సౌదాగర్, అందా బిచార్, తక్తదీర్ తమాషా లాంటి సినిమాల్లో నటించి మంచి జోష్‌లో కెరీర్‌ను పెట్టించింది.

అయితే ఊహించని రీతిలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో మందాకిని ప్రేమలో పడింది. వారిద్దరూ కలిసి చాలా కాలం డేటింగ్ చేశారు. దుబాయ్‌లో చాలాకాలం వారిద్దరూ సహజీవనం చేశారు. ఎప్పుడైతే దావూద్ ఇబ్రహీంతో మందాకిని రిలేషన్, ఫోటోలు బయటకు వచ్చాయో .. అప్పటి నుంచి బాలీవుడ్ నిర్మాతలు ఆఫర్లు ఇవ్వడం మానేశారు. ఆ తర్వాత దావూద్‌తో ఆమె అఫైర్ కూడా బ్రేక్ అయింది.

ఇక స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న మందాకిని కెరీర్ దాదాపు ముగిసిపోయింది. ఆమె 1988లో నటించిన జోర్దార్ సినిమా 8 ఏళ్లు రిలీజ్‌కు నోచుకోలేకపోయింది. ఆ సినిమా 1996లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆమె సినిమా పరిశ్రమకు చెందిన డాక్టర్ కగ్యూర్ టీ రింపోచేను వివాహం చేసుకొని దాంపత్య జీవితంతో సరిపెట్టుకొన్నది.

Do You Know Ram Teri Ganga Maili fame Mandakini spoiled career due to affair with Dawood Ibrahim

ఇదిలా ఉండగా, దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని కరాచీలో చావుబతుకుల్లో ఉన్నారనే వార్త సంచలనం రేపింది. ఆయనపై విష ప్రయోగం జరిగిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో ఉన్నారనే వార్త వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో మందాకిని మరోసారి వార్తల్లో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X