Top Heroine List: మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా రష్మిక.. నేషనల్ క్రష్ నం. 1.. మిగితా స్టార్స్ ఏ స్థానాల్లో ఉన్నార
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కన్నడ స్టార్స్ హవా తక్కువ. వారి మార్కెట్ పరిధి కూడా చాలా పరిమితంగా ఉండేది. చుట్టూ తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌కు కేరాఫ్ అయిన ముంబై కూడా పక్కనే ఉండటంతో కర్ణాటకలో అన్ని భాషా చిత్రాలు రిలీజ్ అవుతాయి. తెలుగు, తమిళ, హిందీ సినిమాలైతే కన్నడ చిత్రాలను మించి వసూళ్లను రాబట్టేవి. పరభాషా హీరోలకు కూడా అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో అక్కడి మేకర్స్ కూడా ఆచితూచి చాలా తక్కువ బడ్జెట్‌లోనే సినిమాలు తీసేవారు.
కేజీఎఫ్ సిరీస్, కాంతారా వంటి సినిమాలు ఈ మూస ధోరణిని బద్ధలుకొట్టి కన్నడ సినిమా సత్తాను చాటి చెప్పాయి. ఈ చిత్రాల బాటలోనే మరిన్ని బడా ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తున్నారు కన్నడ మేకర్స్. అయితే దక్షిణాది, ఉత్తరాది సినిమాల్లోని టాప్ హీరోయిన్లంతా కన్నడ అమ్మాయిలే కావడం గమనార్హం. ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టి, దీపికా పదుకొణే, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి తారలు కన్నడ కస్తూరిలే. వీరిలో దీపిక, రష్మికలు నార్త్, సౌత్‌లను ఏలుతున్నారు.

కిరాక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారారు. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్, పుష్ప సినిమాలు రష్మికకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బాయ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది.
ఇక గతేడాది సందీప్ రెడ్డి వంగా - రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'యానిమల్'లో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయే భర్తను అర్ధం చేసుకుంటూ, కుటుంబాన్ని చక్కదిద్దే ఇల్లాలిగా ఆమె అద్భుతంగా నటించారు. యానిమల్ ఘన విజయంతో బీటౌన్‌లో రష్మికు వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి. అయితే ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ, మంచి క్యారెక్టర్లకు ఓకే చెబుతున్నారు రష్మిక.

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ - ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సికందర్'లో ఆమె ఛాన్స్ కొట్టేశారు. ఏకంగా కండలవీరుడితో రొమాన్స్ చేసే అవకాశం రావడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అలాగే ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'పుష్ప-2'లో శ్రీవల్లిగా మరోసారి మెస్మరైజ్ చేయనున్నారు రష్మిక. దీనితో పాటు రైన్ బో, గర్ల్‌ఫ్రెండ్ అనే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ రష్మిక నటించనున్నారు.
ఈ నేపథ్యంలో కన్నడ హీరోయిన్స్‌లో పాపులర్ ఎవరంటూ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో డింపుల్ బ్యూటీ రచితా రామ్, రాధికా పండిట్, రమ్య, అషికా రంగనాథ్‌లు ఉన్నారు. దీంతో రష్మి అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అషిక సైతం తన అందం, నటనతో క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈమె కూడా అగ్ర కథానాయికగా మారే అవకాశాలు లేకపోలేదు.


Click it and Unblock the Notifications











