మరోసారి డీప్‌ఫేక్ బారిన రష్మిక మందన్న.. అప్పుడు కంప్లైంట్, మరి ఇప్పుడేం చేసిందో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఆమె అందం, సినిమాల గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. కానీ ఈ మధ్య మాత్రం ఈమె పెళ్లి, ఫేక్ వీడియోలే నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గతేడాది ఈమెకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో రావడం.. అది నెట్టింట వైరల్ కావడంతో పెద్ద రచ్చే సాగింది.

ముఖ్యంగా రష్మిక ఇచ్చిన ఫిర్యాదుతో ఇటీవలే పోలీసులు నిందితులను కూడా పట్టుకుని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే గతంలో ఇలాంటి వీడియో చూసి పోలీసులకు ఫిర్యాదు చేసిన రష్మిక.. ఈ సారి మాత్రం షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Rashmika Mandanna What to Do After Seeing Her Another Deepfake Video

2023 నవంబర్ లో రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ ఫైక్ వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే దానిపై రష్మిక అప్పుడే స్పందించారు. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టును కూడా రాసుకు వచ్చింది. ఈ వీడియో తనను చాలా బాధించిందని.. ఇది తనకు మాత్రమే భయాన్ని కల్పించడం లేదని, టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూసి ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. ఆ తర్వాత దీనిపై దేశంలోని అందరూ స్పందించడం.. పోలీసు కేసు నమోదు కావడం జరిగింది.

ఆ తర్వాత పోలీసులు నిందితులను కూడా పట్టుకుని అరెస్ట్ చేశారు. చట్టపరంగా చర్యలు కూడా తీసుకున్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ వీడియోలో రష్మిక ఫేస్ కావాలనే పెట్టినట్లు సులువుగా తెలిసిపోతుంది. ఇందులో రష్మిక చాలా అసభ్యకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తాను చాలా ఓ పాటకు డ్యాన్స్ వేస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Do You Know Rashmika Mandanna What to Do After Seeing Her Another Deepfake Video

అయితే ఈ వీడియోపై రష్మిక మందన్నా ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఆమె ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసిన ఓ వ్యక్తే రెండు వారాల క్రితం ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. రష్మిక ఏఐ పిక్స్ అంటూ రాసుకొచ్చాడు. అయితే రష్మిక పెట్టుకున్న డీపీయే ఈ అకౌంట్ కూడా పెట్టగా.. చాలామంది తెలియని వాళ్లు ఇదే ఆమె అకౌంట్ అనుకుంటున్నారు. ముఖంయంగా రష్మి ఏఐ పిక్స్ అంటూ... షాక్ అవుతున్నట్లు ఉన్న ఎమోజీని జోడించారు.

దీంతో రష్మికనే ఇలా రియాక్షన్ ఇచ్చిందంటూ చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన రష్మిక... ఈ సారి మాత్రం జస్ట్ ఇలా షాక్ అయి వీడియో పోస్ట్ చేసిందేమోనని చూస్తున్నారు. కానీ చివరకు ఆ అకౌంట్ ఓపెన్ చేసి.. అది ఆమెది కాదని తెలుసుకుని షాక్ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ ఈ ఘటనపై స్పందించలేదు. చూడాలి మరి రష్మిక ఈ వీడియోపై ఎలా స్పందించనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X