ముగ్గురు స్టార్ హీరోలతో జోరుగా అఫైర్.. ఇంకా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా?
దక్షిణాది నుంచి హిందీ సినీ పరిశ్రమకు వెళ్లడమే కాకుండా అక్కడ రాణిలా స్టార్ డమ్ తెచ్చుకొన్న హీరోయిన్లలో రేఖ ఒకరు. హేమ మాలిని, శ్రీదేవి, జయప్రద, దివ్య భారతీ కూడా ఆమె బాటలో నడించారు. 80, 90 దశకంలో రేఖ సినిమా వచ్చిందంటే.. బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. కుర్రకారు థియేటర్లకు పరిగెత్తేలా ఆమె తన సినిమాలతో మ్యాజిక్ చేశారు.
వెండితెరపై సూపర్ స్టార్‌గా వెలిగినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమెకు అన్నీ చేదు అనుభవాలే మిగిలాయి. చివరకు ఒంటరితనంతో బతుకుతూ దాంపత్య జీవితానికి దూరంగా ఆమె జీవితాన్ని వెళ్లదీస్తున్నది. ఆమె జీవితం, ఆఫైర్లు, బ్రేకప్స్, భర్త మరణం విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో రేఖ ఎదురులేని హీరోయిన్‌గానే కాకుండా మహారాణి ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఆమె సినిమాల కోసం, డేట్ల కోసం అగ్ర నిర్మాతలు, హీరోలు, దర్శకులు క్యూ కట్టే పరిస్థితి ఉండేది. అయితే ఒక్కొ విజయాన్ని దక్కించుకొంటూ చాలా ఏళ్లు నెంబర్ వన్ హీరోయిన్ స్థాయిలోనే ఉండిపోయారు. జీనత్ ఆమన్, హేమా మాలిని, డింపుల్ కపాడియా లాంటి హీరోయిన్లు పోటీ ఇచ్చినా తన స్థానానికి ఢోకా లేకుండా చూసుకొన్నారు.
ఇక బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతూనే పలువురు హీరోలతో ప్రేమాయణాన్ని కొనసాగించింది. ఆమె జీవితంతో ఎక్కువ కాలం ముడిపడి ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రమే. అమితాబ్‌తో ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చినట్టే.. వచ్చి ఆగిపోయింది. అమితాబ్‌తో బ్రేకప్ తర్వాత పలువురు హీరోలతో అఫైర్ రూమర్లు గట్టిగానే వినిపించాయి.

రేఖతో అఫైర్ రూమర్లు వచ్చిన వారిలో ప్రధానంగా వినోద్ మెహ్రా, అక్షయ్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపస్తాయి. వినోద్ మెహ్రాతో చాలా కాలం అఫైర్ నడిచిందని గట్టిగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రేఖ మధ్య కూడా అలాంటే ప్రేమ కథే నడిచిందని చెప్పుకొంటారు. ఈ ఇద్దరే కాకుండా మరికొంత మంది హీరోలతో లింకులను మీడియా అంటగట్టాయి. అయితే అవి ఎక్కువ కాలం మీడియాలో నిలువలేకపోయాయి.

ఉత్తరాదిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్‌తో రేఖ వివాహం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖేష్‌తో దాంపత్య జీవితం అంతా సవ్యంగా కొనసాగుతుందని అనుకొంటుండగా.. భర్త అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం సంచలనం రేపింది. భర్త ముఖేష్ మరణం తర్వాత రేఖ మళ్లీ వైవాహిక జీవితం వైపు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఆమె ఒంటరిగానే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.

అయితే రేఖ జీవితంపై బలమైన ప్రభావం చూపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే..అది అమితాబ్ మాత్రమే అని సినీ పండితులు చెప్పుకొంటారు. అయితే ఇప్పటికీ అమితాబ్ అంటే చెప్పలేనంత ప్రేమ ఉందనే విషయం కాదనలేనిది. ఇప్పటికీ రేఖ, అమితాబ్ బంధంపై జయబాధురికి పలు అనుమానాలు ఉంటాయనే గుసగుసలు భారీగానే వినిపిస్తాయి. అందుకే ఆమె మళ్లీ వివాహం చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయిందనే విషయంపై చర్చ జరుగుతుంటుంది.
ఇది ఇలా ఉంటే.. రేఖ అందచందాలు ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. చెక్కు చెదని గ్లామర్. ఎన్ని కష్టాలు దాటిని చెదరని చిరునవ్వు ఆమె సొంతం. నిత్యం యోగా, సరైన పోషక ఆహారం ఆమె గ్లామర్ సీక్రెట్ అంటూ చెప్పుకొంటారు. ఆరుపదుల వయసు దాటినా ఇంకా యవ్వనంతో రేఖ నిగనిగలాడుతూ..నేటితరం హీరోయిన్లకు కూడా సవాల్ విసురుతుంటారు.


Click it and Unblock the Notifications











