Animal తృప్తి డిమ్రీ రోల్‌ను మిస్ చేసుకొన్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా? జోయా పాత్రకు ఎవర్ని అనుకొన్నారంటే?
యానిమల్ మూవీ కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. రణ్‌బీర్ కపూర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నది. సందీప్ రెడ్డి వంగా స్టామినాను ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీకి చూపించింది. ఈ సినిమాలో ప్రతీ పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నది. ఈ సినిమాలో జోయా పాత్రకు యూత్‌ఫుల్లుగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో ఆ పాత్రకు తృప్తి డిమ్రీ కాకుండా మరో బాలీవుడ్ హీరోయిన్‌ను ఆడిషన్ చేశారట.. ఆ హీరోయిన్ ఎలా ఈ పాత్రను చేజార్చుకొన్నదంటే?
యానిమల్ సినిమాలో అన్ని పాత్రలతోపాటు జోయా పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. జోయా రోల్‌ను దర్శకుడు పవర్‌ఫుల్ గాను, అలాగే మోస్ట్ గ్లామరస్‌గాను డిజైన్ చేశాడు. ఆ పాత్రలో తానేమీ ఆశించాడో అంతకు రెండితల రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. ఆ సినిమాలో జోయా పాత్ర కథను మలుపు తిప్పడంతో అందరూ ఆమె గురించే ఆలోచించడం మొదలుపెట్టారు.

ఇక జోయా పాత్ర ఎంత ఇంటెన్స్ క్యారెక్టరో..అంతకు మంచి తృప్తి ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఆ పాత్రను మరొకరు ఎవరూ చేయలేరనే విధంగా మార్కులు కొట్టేసింది. సినిమా రిలీజ్ తర్వాత ఎవరీ తృప్తి డిమ్రీ అని గూగుల్ సర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే అంతలా ఇంపాక్ట్ చూపించిన జోయా పాత్రకు ముందు తృప్తి డిమ్రీ కాదంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇక జోయా పాత్ర కోసం చాలా మందికి ఆడిషన్ చేశారట. అందులో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ కూడా ఒకరు. ఆమెను ఆ పాత్ర కోసం ఆడిషన్ చేశారు. దాదాపు జోయాగా సారానే ఫిక్స్ అయ్యారు. అంతలోనే సందీప్ రెడ్డి వంగా ఆ పాత్రకు ఆమె సూట్ కాదని తేల్చారట. ఆమె ఏ మాత్రం కరెక్ట్ కాదని నిర్ణయించుకొన్నారట. దాంతో మళ్లీ ఆ పాత్ర కోసం చాలా రోజుల వెతికారనేది యూనిట్ వర్గాల సమాచారం.

సారా ఆలీ ఖాన్‌ను తప్పించిన తర్వాత చాలా మందిని పరిశీలించి తృప్తి డిమ్రీని తీసుకొన్నారు. ఈ విషయంలో సందీప్ రెడ్డి కరెక్ట్ అని ఆమె కూడా నిరూపించింది. ప్రతీ సీన్‌లోను జోయాగా రెచ్చిపోయి నటించింది. దాదాపు నగ్నంగా నటించినంత పనిచేసింది. సినిమా మొత్తంలో ఆ పాత్ర క్రియేట్ చేసిన ప్రకంపనలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు అని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 900 కోట్ల రూపాయల మైలు రాయిని అధిగమించేందుకు పరుగులు పెడుతున్నది. ఈ చిత్రం బాక్సాఫీస్ తిరుగులేని వసూళ్లను సాధిసత్ున్నది. హిందీలోనే 530 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో 27 మిలియన్లు అంటే 225 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళం, తెలుగు, కన్నడలో కలిపి ఈ సినిమా 850 కోట్ల రూపాయలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











