ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శ్రద్దాకపూర్.. లవర్ సిస్టర్ చేసిన పనికి అడ్డంగా బుక్!
సాహో సినిమాతో శ్రద్దాకపూర్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అయితే ఆ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో.. మరోసారి తెలుగు అభిమానులకు దర్శనం ఇవ్వలేకపోయింది. అయితే బాలీవుడ్‌లో కూడా అంతగా సినిమాల సక్సెస్ కాకపోవడం గమనార్హం. అయితే తాజాగా కొత్త ప్రియుడితో కలిసి వేకేషన్‌లో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..పెళ్లికి ముందు
కొద్ది నెలల క్రితం రాహుల్ మోడీతో కలిసి ఉన్న వీడియో బయటకు పొక్కడంతో శ్రద్దాకపూర్ అఫైర్ బయటకు వచ్చింది. అయితే శ్రద్దాకపూర్, రాహుల్‌తో అఫైర్ గురించి సీక్రెట్‌గానే ఉంచింది. వారిద్దరూ తమ డేటింగ్ విషయంపై గుంభనంగా వ్యవహరించారు. అయితే బాలీవుడ్ మీడియాలో మాత్రం వారిద్దరి లవ్ అఫైర్ గురించి గట్టిగానే వార్తలు వినిపించాయి.

తాజాగా తాను వెకేషన్‌కు వెళ్లినట్టు ఆమె ఓ ఫోటోను షేర్ చేసింది. ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో గురించి చెబుతూ.. నా వెనుక ఉన్న అందమైన ప్రదేశాన్ని, పచ్చటి మైదానాలు చూడండి అంటూ అభిమానులతో ముచ్చటించింది. అయితే సుందర ప్రదేశాన్ని చూసి అభిమానులు కూడా ఫిదా అయ్యారు. అయితే ఆ ఫోటోనే ప్రియుడితో సీక్రెట్‌గా వెకేషన్ జరుపుకొంటున్నదనే విషయం బట్టబయలైంది.
ఇక శ్రద్దాకపూర్ తన ప్రియుడితో పట్టుపడటం వెను రాహుల్ మోడీ సోదరి హస్తం ఉంది. ఆమె తన సోదరుడు రాహుల్ ఫోటోను షేర్ చేసింది. నా సోదరుడు విదేశాల్లో విహార యాత్ర చేస్తున్నాడు అంటూ వెల్లడించింది. తీరా ఆ ఫోటో చూస్తే.. శ్రద్దాకపూర్ షేర్ చేసిన ఫోటోలోని బ్యాక్ గ్రౌండ్ సరిపోయింది. దాంతో వారిద్దరి అఫైర్, డైటింగ్ వ్యవహారం రెడ్ హ్యాండెడ్‌గా నెటిజన్లు పట్టేశారు.


Click it and Unblock the Notifications











