సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న శ్రీలీల.. కొత్త ఫీల్డ్‌లో ఎంట్రీ ఇస్తున్న ధమాకా భామ
తెలుగు సినిమా దగ్గర ఎప్పుడు నుంచో పరభాషా హీరోయిన్స్ డామినేషన్ ఉంటూనే ఉంటుంది. ఇది ఇప్పుడది కాదు ఎన్నో దశాబ్దాలుగానే మన వాళ్ళకి పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా చాలా మందే టాలీవుడ్ లో వచ్చి తమ కెరీర్ లు సెట్ చేసేసుకున్నారు. కానీ మన దగ్గర ఉన్న మన హీరోయిన్స్ పరిస్థితి ఏంటి అనే సమయంలో కొన్ని దశాబ్దాలే మారిపోయాయి.
మరి అలాంటి సమయంలో వచ్చిన ఒక యంగ్ సెన్సేషన్ శ్రీలీల. మొదటి సినిమాతోనే మంచి హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మాస్ మహారాజ్ "ధమాకా" టాలీవుడ్ నిజమైన ధమాకా అనిపించుకుంది. అక్కడ నుంచి ఒక టైం లో అయితే టాలీవుడ్ లోనే మోస్ట్ యంగ్ హీరోయిన్ కం అత్యధిక సినిమాలు కూడా చేతిలో ఉన్న ఇండియన్ హీరోయిన్ గా కూడా రికార్డు సెట్ చేసింది.

కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ లు రావడం లేదు కానీ ఓకే చేసిన సినిమాలు అన్నీ వరుసగా చేస్తూ వస్తుంది. ప్రస్తుతానికి ఇలా సినిమాలు చేయడమే కాకుండా శ్రీలీల లో మరో టాలెంట్ కూడా ఉంది. ఆమె సినిమాలతో పాటుగా డాక్టర్ కూడా చదువుతున్న విషయం చాలా మందికి తెలిసే ఉండవచ్చు.
అయితే ఈ చదువు విషయంలో ఈ మధ్య కాలంలో లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ ఆమె బిజీగా ఉంది. శ్రీలీల రీసెంట్ గా కొన్ని ఎడ్యుకేషనల్ సంబధించి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. మొన్నటి వరకు మన తెలుగు రాష్ట్రాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి ఆమె తనదైన శైలి యాడ్స్ చేస్తే ఇప్పుడు అమ్మడు తమిళ్ లో కూడా చేయడం స్టార్ట్ చేసింది.

ఈసారి ఒక ఏవియేషన్ కోర్స్ సంబంధించి చేస్తుంది. మొత్తానికి అయితే శ్రీలీల తాను చదువుకోడమే కాకుండా అందరినీ చదువుకోమని చెబుతుంది.. కాగా ఈ ఏడాదిలో శ్రీలీల సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించిన చిత్రం "గుంటూరు కారం" రిలీజ్ కి వచ్చింది.
నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాలో బిజీగా ఉంది అలాగే నితిన్ తో "రాబిన్ హుడ్" నెక్స్ట్ మరోసారి మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు ఆమె చేస్తుంది. ఇలా ఓవరాల్ గా ఫామ్ లో లేనప్పటికీ శ్రీలీల టాలీవుడ్ లో మంచి బిజీ గానే కనిపిస్తుంది. ఇక మున్ముందు మరిన్ని ఆఫర్స్ వస్తాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











