ఆ ఒక్కరోజు మాత్రం తమన్నా స్నానం చేయదట.. కారణం ఏమిటో తెలుసా? -

గత రెండు దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్ల అందరిలోనూ మిల్కీ బ్యూటీ తమన్న చాలా ప్రత్యేకమైన హీరోయిన్ అనే చెప్పాలి. ఈ బ్యూటీ తన అందంతో పాటు గ్లామర్ తో ఇటీవల కాలంలో బాగా పాపులర్ అవుతోంది. తాజాగా తమన్నా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకొచ్చింది. తమన్నా ఆ ఒక్క రోజు అస్సలు స్నానం చేయదట. ఎందుకో మనం కూడా తెలుసుకుందాం పదండి.

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కాలంలో లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లతో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. ఇక రీసెంట్ గా ఆమె చేసిన ఐటమ్ సాంగ్ నువ్వు కావాలయ్యా పాటకు ఎంతటి రెస్పాన్స్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జైలర్ సినిమాలో తమన్నా చేసిన ఈ ఐటెం సాంగ్ ఆ సినిమా సక్సెస్ ఫుల్ కావడానికి బాగా హెల్ప్ చేసింది.

Do you know Tamannaah Bhatia Doesn t take shower on This Day Here is the Reason

గత కొంతకాలంగా టాలీవుడ్ కు దూరమైన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు, వెబ్ సిరీస్ చేసుకుంటూ బిజీగా ఉంది. మరోవైపు మన ప్రియుడు విజయ్ వర్మ గురించిన వార్తలతో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకొచ్చింది. అదేంటంటే తమన్నా ఆదివారం రోజు అస్సలు స్నానం చేయదట.

సాధారణంగా ఆదివారం అనగానే తలంటూ స్నానం చేసి వీక్ మొత్తం మోసిన భారాన్ని దించేసుకుంటారు. కానీ తమన్నా మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆదివారం స్నానం మాత్రం చేయదట. మరి ఇలాంటి వింత అలవాటు తమన్నాకు ఎందుకు ఉంది ? అంటే దానికి సమాధానం కూడా ఉంది. వీక్ డేస్ లో తమన్నా మేకప్ కారణంగా ఒక్కరోజులో ఏకంగా మూడు సార్లు స్నానం చేయాల్సి వస్తుందట.

Do you know Tamannaah Bhatia Doesn t take shower on This Day Here is the Reason

ఇలా వారం మొత్తం రోజుకి మూడు సార్లు స్నానం చేసి విసిగిపోయిన ఈ బ్యూటీ సండే రోజు మాత్రం స్నానానికి బ్రేక్ ఇస్తుందట. ఇక అంతకుముందే ఓ ఇంటర్వ్యూలో తనకు రాత్రి 7 దాటిన తర్వాత బయటకు వెళ్లడం, లేదా పని చేయడం అస్సలు నచ్చదు అంటూ తనకున్న మరో వింత అలవాటును బయట పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె గురించి బయటకు వచ్చిన ఈ సండే రోజు స్నానానికి బ్రేక్ అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఎంతైనా ఈ మిల్కీ బ్యూటీ అందం పరంగానే కాదు వ్యక్తిత్వం పరంగా కూడా ప్రత్యేకమే అంటున్నారు ఆమె అభిమానులు. కాగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే తమన్నా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం ప్రియుడితో తమన్నా పెళ్లి ఎప్పుడు ? అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆమె ఫాలోవర్స్. మరి అందాల ముద్దుగుమ్మ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో చూడాలి. తమన్నా ప్రస్తుతం ఓదెల 2 అనే తెలుగు మూవీలో నటిస్తోంది.

More from Filmibeat

Read more about: tamannaah bhatia tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X