తమన్నాకు ముద్దు పేరు పెట్టుకొన్న ప్రియుడు.. మిల్కీ బ్యూటీ నిక్ నేమ్ ఏమిటో తెలుసా?
దక్షిణాదిలోనే కాకుండా హిందీలో కూడా రాణిస్తున్న తమన్నా భాటియా ప్రస్తుతం ఎంసీఏ చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్ వర్మతో డేటింగ్ చేస్తూ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నది. ఈ ఇద్దరి ప్రేమ కథ గురించి జాతీయ మీడియాలో కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. అయితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన విజయ్ వర్మ ఇప్పుడు ముద్దు ముద్దుగా నిక్ నేమ్‌తో పిలుచుకొంటున్నారు. ఇప్పటికే మిల్కీ బ్యూటీ అనే ముద్దు పేరుతో అభిమానులు పిలుచుకొంటున్న నేపథ్యంలో విజయ్ వర్మ పెట్టిన నిక్ నేమ్ ఏమిటంటే??
తమన్నా భాటియా ప్రియుడు విజయ్ వర్మ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఆయన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఆయన నటించిన దహాద్ వెబ్ సిరీస్‌ను ఇటీవల బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ ప్రదర్శనకు సోనాక్షి సిన్హా, రీమా కంగ్తీ, రుచికా ఒబెరాయ్, జోయా అఖ్తర్ లాంటి సెలబ్రిటీలతోపాటు విజయ్ వర్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా దహాడ్ టీమ్‌ను తమన్నా ప్రశంసలతో ముంచెత్తుతూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది.

తమన్నా పెట్టిన పోస్టుకు విజయ్ వర్మ స్పందిస్తూ.. థ్యాంక్యూ టామటార్ (Tamatar) అంటూ ముద్దుగా నిక్ నేమ్ పెట్టి ప్రేమను చాటుకొన్నాడు.

గోవాలో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా తమన్నా భాటియా, విజయ్ వర్మ ఇద్దరు ముద్దు పెట్టుకొంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో వారిద్దరి డేటింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి వారిద్దరూ రకరకాలుగా పలు ప్రదేశాల్లో కనిపిస్తూ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.


Click it and Unblock the Notifications











