Bhumika Chawla: Kushi మూవీలో భూమిక నడుము అందాలు.. అసలు సీక్రెట్ మీకు తెలుసా?
హీరోయిన్ భూమికా చావ్లా అనగానే ఖుషి సినిమాలో నడుము సీన్ గుర్తుకు వస్తుంది. అంతలా ఆమె ఆ సినిమాతో క్రేజ్ కొట్టేసింది. పంజాబీ ఫ్యామిలీ నుంచి వచ్చిన భూమిక.. దిల్లీలో పెరిగింది. ఇక సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి.. మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ముఖ్యంగా ఖుషి సినిమాల ఆమె నడుము అందానికి ఓ సీక్రెట్ కూడా ఉందట. ఆ వివరాల్లోకి వెళితే...
పంజాబీ ఫ్యామిలీకి చెందిన భూమిక చావ్లా.. దిల్లీలో విద్యాభ్యాసం చేసింది. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. భూమిక తండ్రి ఓ రిటైర్డ్ ఆర్మి ఆఫీసర్. ఇక ముంబైలో పెరిగిన ఆమెకు సినిమాలపై మక్కువ ఏర్పడింది. మొదట హిప్ హిప్ హుర్రే అనే సిరీస్ లో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో సుమంత్ తో కలిసి యువకుడు అనే మూవీ హీరోయిన్ గా నటించింది.

ఇక యువకుడు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ తర్వాత భూమికకు పవన్ కల్యాణ్ నటించే అవకాశం కొట్టేసింది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి మూవీలో నటించి మెప్పించింది. ఇక మూవీలో ఆమె నడుము అందాలు.. ఇప్పటి కుర్రాళ్లకు కూడా గుర్తుండిపోతాయి. అంతలా ఆ నడుము సీన్ అందరికీ గుర్తుండిపోయింది. ఇప్పటికీ ఆ సీన్ ను ఎన్నో సినిమాల్లో స్పూఫ్ గా వాడారు.
ఇటీవల చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో కూడా ఈ సీన్ ను పెట్టారు. చిరంజీవి, శ్రీముఖి.. ఖుషి సినిమాలోని పవన్, భూమికల నడుము సీన్ ను రీక్రియెట్ చేశారు. కానీ ఆ సీన్స్ కు సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. పవన్ స్వాగ్ చిరు మ్యాచ్ చేయలేరని అంటున్నారు. ఇదిలా ఉంటే భూమిక నడుము అందాల వెనుక ఓ సీక్రెట్ ఉందట.

అసలు భూమిక నడుము అందానికి కారణం... ఆమె తీసుకునే ఆహారం అని సమాచారం. పండ్లు, కూరగాయయలు, మిల్లెట్స్ వంటివి మాత్రమే భూమిక తీసుకునేదట. రోజంతా నీరు త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో గ్లో వస్తుందట. అంతే కాదు.. ఆమె రోజూ వ్యాయమం చేస్తుందని తెలిసింది. అలా చేయడంతోనే ఆమె నడుము అందంగా కనిపించిందని తెలుస్తోంది.

ఇక భూమిక ఫిట్నెస్ సీక్రెట్ విషయానికి వస్తే... స్విమ్మింగ్, యోగాతో పాటు.. ప్రతి రాత్రి 7-9 గంటల పాటు నిద్రపోతుందని తెలుస్తోంది. అందుకే అందంతో పాటు.. ఆరోగ్యంగా ఉంటుందని సమాచారం. ఇక తన చర్మసౌందర్యానికి కూడా సహజ పద్దతుల్లో తయారు చేసిన వాటినే వాడుతుందట. అలా ఆరోజుల్లో భూమిక ఇవన్నీ పాటించి.. నడుము అందాలతో కుర్రాకారు హృదయాలను కొట్టకొట్టింది. ప్రస్తుతం భూమిక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.


Click it and Unblock the Notifications











