Salaar Movie: సలార్ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
దేశం మొత్తం ఇప్పుడు ప్రభాస్ సలార్ మేనియా నడుస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం.. ప్రభాస్ సాలిడ్ హిట్ తో కం బ్యాక్ ఇచ్చాడు. బహుబలి తర్వాత ఆ స్థాయిలో అలరించిన సినిమా లేదు. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ఫ్యాన్స్ కోరిక తీరిపోనుంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ క్యారెక్టర్ ను ఓ హీరోయిన్ మిస్ చేసుకుందట. ఆమె ఎవరు.. ఎందుకు మిస్ చేసుకుందనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రం ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 22న అర్ధరాత్రి నుంచే థియేటర్లలో సందడి చేస్తుంది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మరో హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కూడా నటించారు. హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది.

అయితే ఇంత మంచి బ్లాక్ బస్టర్ సినిమాను ఓ హీరోయిన్ మిస్ చేసుకుంది. ప్రభాస్ పక్కన నటించడమే ఓ అదృష్టంగా భావిస్తారు చాలా మంది. అయితే ఈ హీరోయిన్ మాత్రం ప్రభాస్ పక్కన నటించనని చెప్పిందట. ఆమె ఎవరా అనే కదా మీ డౌట్.. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ భార్య అలియా భట్. ఈ అందాల భామ.. మొదట సలార్ సినిమాకు హీరోయిన్ గా అనుకున్నారట మేకర్స్. ఇంటికి వెళ్లి మరీ ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ సినిమాలో నటించమని అడిగారని తెలుస్తోంది.

అయితే అలియా భట్ మాత్రం ఇప్పటికే ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ప్లాఫ్ అని ఆలోచనలో పడిందట. బహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాదేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు సలార్ కూడా ఆడకపోతే.. తనకు ఉన్న క్రేజ్ పోతుందని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాను ఈ సినిమాలో నటించనని చెప్పిందట. దీంతో చిత్ర యూనిట్ శృతి హాసన్ ను తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్, అభిమానులు.. మంచి సినిమాను మిస్ చేసుకున్నావ్ అలియా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ పక్కన అలియా భట్ జోడి బాగుండేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సలార్ సినిమా రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూలు ఖాయం. ఇక త్వరలో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరనుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











