Samantha Kushi: ఖుషి సినిమాను జస్ట్‌లో మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత కలిసి నటించిన చిత్రం ఖుషి. ఇక ఈ సినిమా ఈరోజు సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వస్తోంది. శివనిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మొదట హీరోయిన్ అనుకున్నది సమంత కాదట. మరో స్టార్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం ఖుషి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక హృదయం సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన హేషమ్ అబ్దుల్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఖుషి మూవీలో శివనిర్వాణ.. రియాలిటీని చూపించారని అంటున్నారు. కాకపోతే అందరికి తెలిసిన స్టోరీ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపిస్తోంది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా రెస్పాన్స్ పై స్పందించాడు. ఇక ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో.. ఈ మాట విని 5 ఏళ్లు అయిందంటూ.. ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఖుషి సినిమా గురించి మరో విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా సమంతను అనుకోలేదని అంటున్నారు. ఆమె ప్లేస్ లో మొదట ఓ స్టార్ హీరోయిన్ ను అనుకున్నారట. ఆమె ఎవరో కాదు.. రష్మిక మందన్నా. విజయ్ దేవరకొండ సరసన మొదట రష్మికను అనుకున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దర్శకుడు శివ నిర్వాణ.. మొదట రష్మిక అయితే బాగుంటుందని అనుకున్నారట. అయితే అప్పటికే తెరపై రష్మిక, విజయ్ జోడిలను తెరపై చాలా సార్లు చూశారు.. ఇదే రిపీట్ చేస్తే ఏం బాగుంటుదని మళ్లీ వెనక్కి ఆలోచించారట. అయితే ఈ సినిమాకు హైప్ రావాలంటే.. క్రేజ్ ఉన్న బ్యూటీ అయితే బాగుంటుందని ఆలోచించారని సమాచారం.

ఇక సమంత అప్పుడే నాగ చైతన్యతో విడాకులు తీసుకుని.. సెన్సెషన్ అయింది.. అంతే కాదు.. పుష్ప సినిమాతో ఇండియా లెవెల్ క్రేజ్ అయితే దక్కించుకుంది సమంత. ఇక అలా ఆ పాత్ర సమంతకు చేరిందట. సమంతతో ఇప్పటికే శివ నిర్వాణ మజిలీ అనే సినిమా తీశాడు. ఇక మళ్లీ ఇప్పుడు ఖుషి సినిమాతో తెరకెక్కించాడు శివ. ఇక విజయ్ తో రష్మిక చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేది కాబోలు అంటున్నారు నెటిజన్స్. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.. అలా రష్మిక పాత్ర జస్టులో మిస్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











