Sridevi: స్టార్ హీరో కోసం శ్రీదేవి వారం రోజులు ఉపవాసం.. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలనటిగా వెండి తెర ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా రాణించారు శ్రీదేవీ. తమిళ్ తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఆమె నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే.. ఓ స్టార్ హీరో కోసం శ్రీదేవి వారం రోజులు ఉపవాసం చేసిందట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? అసలు ఎందుకు ఉపవాసం చేసిందంటే?

అతిలోక సుందరిగా పేరు గాంచిన శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తో పాటు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి ఆనాటి స్టార్ హీరోలతో కూడ ఆమె నటించింది. అలాగే.. తమిళంలో స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో నటించారు శ్రీ దేవీ.

Do you know the Reason why heroin sridevi fasted 7 days for rajinikanth

ప్రధానంగా శ్రీ దేవీ- రజనీకాంత్ కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. వీరిద్దరూ కలిసి ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 20కి పైగా సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో మూండ్రు ముడిచు, పోకిరి రాజా, భగవాన్ దాదా,నాన్ ఆడిమై ఇల్లై వంటి సినిమాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలు చేయడంతో వీరు పెళ్లి చేసుకుంటారనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో తామిద్దరం మంచి స్నేహితులమని, మా ఇద్దరం మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే నిర్మాత బోనీ కపూర్‌ను శ్రీదేవి వివాహం చేసుకున్నారు. దీంతో ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడినట్టు అయింది.

అయితే.. ఓ హీరో కోసం శ్రీదేవీ వారం రోజులు పాటు ఉపవాసం ఉన్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు. తమిళ స్టార్ హీరో రజనీ కాంత్ కోసం శ్రీ దేవి ఉపవాసం చేసిందట. ఇండస్ట్రీలో ఇతర హీరోల కంటే రజనీకాంత్‌పై శ్రీదేవి ప్రత్యేకమైన అభిమానం చూపించేవారట. అయితే 2011లో తమిళ హీరో రజనీకాంత్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో రజనీకాంత్ చాలారోజులు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ సమయంలో శ్రీదేవి 7 రోజులు ఉపవాసం ఉండి దీక్ష చేసిందని రజినీ స్వయంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Do you know the Reason why heroin sridevi fasted 7 days for rajinikanth

2011 లో రజినీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను చికిత్స కోసం సింగపూర్ తీసుకెళ్లారు. ఈ విషయం తెలియగానే శ్రీదేవి మనోవేదనకు గురయ్యారు. అనంతరం శ్రీదేవి 7 రోజులు ఉపవాసం ఉండి దీక్ష చేసిందట. రజనీకాంత్ ఆరోగ్యం కోసం షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేశారట. రజినీ కోలుకోవడానికి నిత్యం దైవాన్ని స్మరించుకున్నారట. ఇలా శ్రీదేవి ఉపవాసం, అభిమానుల ప్రార్థనల వల్ల రజనీకాంత్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో రజినీని చూసిన శ్రీదేవి భావోద్వేగానికి గురయ్యారట.

More from Filmibeat

Read more about: rajinikanth sridevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X