10 Beautiful Women: వరల్డ్‌లో టాప్ 10 బ్యూటీఫుల్ సెలబ్రిటీలు .. ప్రియాంక, దీపిక టాప్ ప్లేస్‌లో ఎవరున్నారంటే?
ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఏ మూలకి వెళ్లినా ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు. ఎవరి అందం వారికి ప్రత్యేకం. వీరి అందాన్ని వర్ణించడానికి ఎందరు కవులున్నా సరిపోరు. ఆ అందాన్ని కొలవడానికి కొలమానాలు కూడా లేవు. అందగత్తెలను లెక్కకట్టానికి మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ సహా దేశానికో కాంటెస్ట్ ఉంది. ఇక సినీ పరిశ్రమలో అందాల నటీమణులకు కొదువ లేదు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వీరిలో టాప్ 10 ఎవరో ఒకసారి పరిశీలిస్తే :
1. టేలర్ స్విఫ్ట్ :
టేలర్ ఏలిసన్ స్విఫ్ట్ అమెరికాకు చెందిన ప్రఖ్యాత రాపర్, సింగర్, పాటల రచయిత. గానంలో కొత్త ప్రయోగాలు చేసి గ్రామీ సహా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఇటీవల డెమొక్రాటిక్ పార్టీకి మద్ధతు పలికి ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు

2. నటాలీ పోర్ట్‌మన్ :
పాలస్తీనా - ఇజ్రాయెల్ మధ్య వివాదాస్పద నగరమైన జెరూసలేంలో పుట్టిన ఈమె నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా హాలీవుడ్‌పై ప్రభావం చూపుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్, బీఏఎఫ్‌టీఏ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్‌ను నటాలియా అందుకున్నారు .
3. సెలీనా గోమజ్ :
సెలీనా మేరీ గోమజ్ అలియాస్ సెలీనా గోమజ్ నటి, పాటల రచయిత, సింగర్, నిర్మాత, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. 32 ఏళ్ల వయసులోనే 16 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను తన పేరిట లిఖించుకున్నారు. 2016లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న వ్యక్తిగా.. 2023లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న మహిళగా సెలీనా నిలిచారు.
4. దీపికా పదుకొనె :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు దీపిక. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనె కుమార్తే దీపిక. 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారల్లో ఒకరిగా నిలిచారు. ప్రపంచంలో 100 మంది ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా టైమ్ మేగజైన్ ప్రకటంచింది.

5. స్కార్లెట్ జాన్సన్ :
హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా వెలుగొందుతున్నారు స్కార్లెట్. 10 ఏళ్ల వయసులో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన స్కార్లెట్.. 2018, 2019లలో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా నిలిచారు. క్యాన్సర్‌పై పరిశోధనకు , పేదరికాన్ని రూపుమాపేందుకు లక్షలాది డాలర్లను విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకన్నారు.
6. గాల్ గాడెట్ :
అందం, ముఖంపై చెరగని చిరునవ్వుతో ఫిదా చేసే ఈ బ్యాట్‌మన్ భామ యూదు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. వండర్ ఉమెన్, జస్టిస్ లీగ్, రెడ్ నోటీస్, డెత్ ఆన్ ది నైల్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 2018లో ప్రపంచంలోనే 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా టైమ్ మేగజైన్ ఈమెను ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకునే ఫిమేల్ స్టార్‌గా రెండు సార్లు నిలిచారు.
7. ఏంజెలినా జోలి :
హాలీవుట్ నటి అంటే ప్రపంచ దేశాలకు గుర్తొచ్చే పేరు ఏంజెలినా జోలి. దాదాపు 42 ఏళ్లుగా హాలీవుడ్‌పై తన ప్రభావం చూపుతూనే ఉన్నారు జోలి. ఆస్కార్, టోనీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సహా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను ఆమె అందుకున్నారు. హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ఏంజెలినా పలుమార్లు రికార్డుల్లోకెక్కారు. రొమ్ము క్యాన్సర్ బారినపడినా ఆ మహమ్మారిని జయించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

8. మార్గెట్ రాబీ :
పాన్ ఆమ్, ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, ది లెజెండ్ ఆఫ్ టార్జాన్, సూసైడ్ స్క్వాడ్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మార్గెట్. ప్రపంచంలోనే 100 మంది ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా టైమ్ మేగజైన్ ఆమెను ప్రకటించింది. ఇక 2023లో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే తారల్లో ఒకరిగా ఫోర్బ్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించారు.
9. ప్రియాంక చోప్రా :
భారత్‌కు 2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించి పెట్టిన ప్రియాంక చోప్రా
తొలుత సౌత్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ పాపులారిటీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగారు. పద్మశ్రీ , జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచంలోనే 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా టైమ్ మేగజైన్ రెండు సార్లు ఈమెను ప్రకటించింది.
10. బెయాన్స్ :
బెయాన్స్ గిస్లే నోవ్లెస్ కార్టర్ అలియాస్ బెయాన్స్ .. అమెరికన్ సింగర్‌గా, పాటల రచయితగా , వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా అమెరికన్ కల్చరల్ ఫిగర్‌గా నిలిచారు. అభిమానులు ఈమెను ముద్దుగా క్వీన్ బే అని పిలుచుకుంటారు. 32 గ్రామీ అవార్డులు, బిల్‌బోర్డ్ అవార్డ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకున్నారు. అంతేకాదు.. తన సంపాదనలో అత్యధిక భాగం సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ తన పెద్ద మనసును చాటుకున్నారు.


Click it and Unblock the Notifications











