Divya Bharati Death Mystery మరణానికి గంట ముందు ఏం జరిగింది? దివ్యభారతిది హత్యేనా?
అందాల నటి దివ్యభారతి ఈ లోకాన్ని వీడి 30 ఏళ్లు పూర్తయింది. 1993 ఏప్రిల్ 5వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఆమె సినీ అభిమానులకు గుండెకోతకు గురిచేసింది. దివ్యభారతి మరణాన్ని జీర్ణించుకోవడం సినీ ప్రముఖులకు, అభిమానులకు, అభిమానులకు కష్టతరంగా మారిన విషాదం తెలిసిందే. అయితే మరణించి మూడు దశాబ్దాలు పూర్తవుతున్న ఆమె మరణంపై తలెత్తిన అనుమానాలకు ఇంకా జవాబు లభించకపోవడం అనేక సందేహాలను రేకెత్తిస్తున్నది. దివ్య భారతి మరణానికి ముందు కొన్ని గంటల ముందు ఏం జరిగిందంటే?
చెన్నై నుంచి ముంబైకి: దివ్యభారతి తన మరణానికి కొద్ది గంటల ముందు చెన్నై నుంచి షూటింగ్ ముగించుకొని ముంబైకి చేరింది. ముంబైకి చేరుకొన్న తర్వాత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్‌తో సమావేశమైంది. తాను నటించే ఆందోళన్ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన క్యాస్టూమ్స్ గురించి చర్చించడం మొదలుపెట్టింది. అయితే ఆ సమయంలోనే బాల్కని పిట్టగొడ మీద నుంచి జారి మృత్యువు ఒడిలోకి వెళ్లింది.

మరణానికి కొద్ది గంటల ముందు: అయితే దివ్యభారతి మరణం తర్వాత అనేక రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. మీడియా కథనం ప్రకారం.. నీతా లుల్లా, ఆమె భర్తతో కలిసి దివ్యభారతి మద్యం సేవిస్తున్నది. ఆ సమయంలో వంట మనిషి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నది. ఇంకా కొద్ది మంది ఇంటిలో టెలివిజన్ చూస్తున్నారు. ఆ సమయంలో దివ్యభారతి బాల్కనీలోని గోడపై కూర్చొని ఉంది అని కథనాలు వెల్లడించాయి
తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాటం: దివ్యభారతి బాల్కనీ గోడ మీద కూర్చొని మాట్లాడుతూ బ్యాలెన్స్ కోల్పోయింది. ఆ ప్రయత్నంలో తనను తాను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో ఐదో అంతస్తు నుంచి కిందపడిపోయింది. ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. దాంతో తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఆమె అప్పటికీ శ్వాస తీసుకొంటూనే ఉంది. చికిత్స పొందుతూ ఆమె మరణించారు అని కథనాలు వెలువడ్డాయి.

దివ్యభారతి తండ్రి ఏం చెప్పారంటే? : అయితే దివ్యభారతి మరణం ప్రమాదం కాదు.. సూసైడ్, మర్డర్ అంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఆమె డిప్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకొన్నదనే వార్తలు మీడియాలో వినిపించాయి. అయితే తన కూతురిపై వస్తున్న ఆరోపణలు, వార్తలను ఖండించారు. నా కూతురు ప్రమాదవశాత్తు బాల్కనీ గోడపై కూర్చొని జారి పడిపోయింది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన వివరణ ఇచ్చారు.
దివ్యభారతితి సూసైడా? మర్డరా? : దివ్యభారతి మరణంపై వచ్చిన ఆరోపణలను తండ్రి కొట్టివేస్తూ.. నా కూతురికి ఎలాంటి సమస్యలు లేవు. అతిగా మద్యం సేవించలేదు. అర్ధగంటలో ఎంత మద్యం సేవిస్తారో చెప్పండి. ఈ అపార్ట్‌మెంట్‌లో అన్ని ఫ్లాట్స్‌కు గ్రిల్స్ ఉన్నాయి. దివ్య భారతి ఉండే ఫ్లాట్‌లోని బాల్కనీలో గ్రిల్స్ లేవు. గోడపై నుంచి జారి కిందపడి చనిపోయింది అని ఆయన స్పష్టం చేయడంతో రూమర్లకు తెరపడింది. అయినా ఆమె మరణంపై ఇప్పటికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











