అనుష్క శర్మ కొడుకు పేరేంటి? విరాట్ తన బిడ్డకు పెట్టిన పేరు అర్ధం ఏమిటో తెలుసా?
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. గత కొద్దిరోజులుగా మీడియాలను, సోషల్ మీడియాలోను అనుష్క డెలీవరి గురించి వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ స్వయంగా విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. తమకు రెండో సంతానం ప్రాప్తించిందని తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ చేసిన పోస్టు వివరాల్లోకి వెళితే..
Recommended Video

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఓ యాడ్ షూటింగ్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు వారిద్దరూ డేటింగ్ చేశారు. చివరకు 2017 సంవత్సరంలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో ఇటలీలో వివాహం చేసుకొన్నారు. 2021 సంవత్సరంలో వారికి ఓ కూతురు జన్మించింది. ఆ చిన్నారికి వమికా అని నామకరణం చేశారు. అయితే రెండో బిడ్డ కోసం అనుష్క గర్భం దాల్చిన విషయాన్ని అత్యంత సీక్రెట్‌గా ఉంచారు.

అయితే క్రికెటర్ ఏబీ డివీల్లియర్స్ లీక్ చేయడంతో అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ విషయం బయటకు వచ్చింది. దాంతో ఇంగ్లాండ్ టూరుకు విరాట్ ఎందుకు దూరమయ్యారనే విషయానికి జవాబు లభించింది. తాజాగా అనుష్క పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు అనే విషయాన్ని విరాట్ కోహ్లీ ఆనందంతో వెల్లడించారు.
విరాట్ కోహ్లీ తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి.. నా హృదయంలో కలిగిన అనంతమైన సంతోషాన్ని మీతో పంచుకొంటున్నాను. మా హృదయం ప్రేమతో ఉప్పొంగిపోతున్నది. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మా ఫ్యామిలీలోకి ఆ చిన్నారిని హృదయపూర్వకంగా స్వాగతించాం అని విరాట్ తన పోస్టులో తెలిపారు.

మా రెండో సంతానంగా పుట్టిన బాబుకు అకాయ్ అని నామకరణం చేశాం. వమికా ప్రపంచంలోకి చిట్టి తమ్ముడు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనంద సమయంలో మేము మీ ఆశీస్సులను, అభినందలను స్వీకరిస్తున్నాం. మా జీవితంలో శుభం కలగాలని కోరుకొనే వారికి ధన్యవాదాలు. ఈ ఆనంద సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించకూడదని కోరుకొంటున్నామని అనుష్క, విరాట్ వేడుకొన్నారు.
ఇదిలా ఉండగా, అకాయ్ అనగా టర్కీష్ భాషకు సంబంధించిన పదం. ఈ పదానికి అర్ధం దేదిప్యంగా వెలిగే చంద్రుడు అని అర్థం. తొలి సంతానానికి వమికా అని పేరు పెట్టడం తెలిసిందే. వమికా అంటే సంస్కృత భాషలో దుర్గమాత అని అర్థం. ఇలా తమ బిడ్డలకు సంస్కృతం, టర్కీష్ భాషలో పేరు పెట్టడం విశేషంగా మారింది. చాలా మంది అకాయ్ అంటే ఏమిటి అని గూగుల్‌లో సర్చ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











